ETV Bharat / bharat

ఐరన్​ దోశ పెనం నల్లగా మారిందా? - ఇలా చేసి అద్భుతాన్ని చూడండి! - Iron Dosa Tawa Cleaning Tips

Iron Dosa Tawa: దోశలు వేసుకోవడానికి నాన్​స్టిక్​ బదులు ఐరన్​ పెనం వాడుతున్నారా? ఎంత క్లీన్​ చేసినా కొన్ని రోజులకే నల్లగా మారుతోందా? నో టెన్షన్​. ఈ టిప్స్​ పాటిస్తే దోశ పెనాన్ని కొత్తదానిలా మెరిపించవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ టిప్స్​ ఏంటంటే..

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 12:07 PM IST

Iron Dosa Tawa
Iron Dosa Tawa (ETV Bharat)

Iron Dosa Tawa Cleaning Tips: దోశ, పరాటా, చపాతీ.. మొదలైనవి అన్నీ పెనం మీదనే చేసుకుంటుంటాం. చాలా మంది వీటి కోసం ఐరన్​ పాన్స్ ఉపయోగిస్తుంటారు. అయితే.. వాటిని యూజ్​ చేసిన తర్వాత మెయింటెనెన్స్​ విషయంలో కాస్త నిర్లక్ష్యం వహిస్తారు. దీంతో అవి కాలక్రమేణా నల్లగా మారడం, తుప్పు పట్డడం వంటివి జరుగుతుంటాయి. దీంతో వాటిని వాడలేక.. కొత్తవి కొంటుంటారు. అయితే.. కొత్తవి కొనాల్సిన అవసరం లేకుండా.. నల్లగా మారిన, తుప్పు పట్టిన ఐరన్​ పెనాన్ని క్లీన్​ చేయడానికి కొన్ని టిప్స్​ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పైగా వీటికి పెద్ద ఖర్చు కూడా కాదంటున్నారు. ఈ టిప్స్​ పాటించి క్లీన్​ చేస్తే నల్లగా మారిన పాన్​ కొత్తదానిలా నిగనిగలాడుతూ కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ టిప్స్​ ఏంటో ఇప్పుడు చూద్దాం..

దోశ పెనం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలంటే వాడిన వెంటనే శుభ్రపరచడం మొదట చేయాల్సిన పని అని నిపుణులు అంటున్నారు. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. పెనం కొద్దిగా చల్లారిన తర్వాత క్లీన్ చేయాలి. దానిపై ఉన్న పిండి అవశేషాలు గట్టిపడేవరకు చూడవద్దు. అదే విధంగా పాన్​ శుభ్రం చేయడానికి మృదువైన స్పాంజ్ యూజ్ చేయాలి. గరుకుగా ఉన్నవి వాడితే పెనం ఉపరితలం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంత చేసినా నల్లగా అయ్యిందంటే ఈ టిప్స్​ పాటిస్తే సరి..

గారెలు, వడలు నూనెపట్టి ఉంటున్నాయా? - ఈ టిప్స్​ పాటిస్తే చుక్క ఆయిల్ కనిపించదు - ఇంకా ఫుల్ టేస్టీ! - Garelu Making Tips

షాంపూ: నల్లగా ఉన్న పాన్​ను శుభ్రం చేయడానికి నిమ్మకాయ, ఉప్పు, కొద్దిగా షాంపూ అవసరం అవుతాయని నిపుణులు అంటున్నారు. ముందుగా పాన్​ను స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. పాన్ వేడెక్కాక స్టవ్​ ఆఫ్​ చేసి దాని మీద షాంపూ వేసి దానిలో ఒక చెంచా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కూడా వేసి పాన్ అంతా స్ప్రెడ్​ చేయాలి. ఇప్పుడు నిమ్మతొక్కలతో పాన్ అంతా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పెనం మీద పేరుకుపోయిన నూనె, మురికి క్లీన్​ అవుతాయి.ఇలా చేసిన తరువాత పాన్​ను సాధారణ డిష్ వాష్ లిక్విడ్​తో కడగాలి. ఇలా చేస్తే పాన్ పూర్తిగా శుభ్రమై కొత్తదానిలా మెరుస్తుంది.

నిమ్మరసం: నల్లగా మారిన పాన్​ను శుభ్రపరిచేందుకు మరొక చిట్కా కూడా ఉందని నిపుణులు అంటున్నారు. పెనం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మురికి, నూనె తొలగించడానికి ఒక గిన్నెలో కొంచెం నిమ్మరసం తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా డిటర్జెంట్, కొద్దిగా ఇటుక పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ర్కబ్బర్​తో తీసుకుని పెనంపై వేసి బాగా రుద్దాలి. దీంతో పాన్ మీద మురికి, నలుపు, జిడ్డు అంతా వదిలిపోతుంది.

వైట్ వెనిగర్: ఇది కూడా దోశ పెనానికి ఉన్న మురికిని తొలగించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. పాన్ వేడి చేసి నిమ్మరసం, వైట్ వెనిగర్ వేసి స్ర్కబ్​తో బాగా రుద్ది శుభ్రం చేస్తే మురికి పోయి కొత్తదానిలా మెరుస్తుందని అంటున్నారు.

ఆరబెట్టడం తప్పనిసరి: ఎక్కువ మంది దోశ పెనం కడిగిన తర్వాత ఆరబెట్టకుండా అలాగే స్టోర్ చేస్తుంటారు. అలా చేయడం ద్వారా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఐరన్ పెనం క్లీన్ చేసినా దానిని పూర్తిగా ఆరబెట్టాలి. అలాగే దానిని ఉపయోగించే ముందు ఉల్లిపాయను సగానికి కట్​ చేసి ఓ చెక్కను పెనానికి రుద్ది ఆపై ఉపయోగిస్తే బాగుంటుందని అంటున్నారు.

ఎంత శుభ్రం చేసినా పాత్రల్లో పసుపు మరకలు పోవడం లేదా ? ఇలా చేస్తే చిటికెలో సాల్వ్​! - How To Clean Utensils

మరకలు పడి గ్యాస్​ స్టవ్ జిడ్డుగా మారిందా? - ఈ టిప్స్​తో కొత్తదానిలా తళతళా మెరిసిపోద్ది! - Gas Stove Top Cleaning Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.