ETV Bharat / bharat

డిప్యూటీ స్పీకర్​ ఎన్నిక ప్రక్రియను వెంటనే చేపట్టాలి : మోదీకి ఖర్గే లేఖ - KHARGE LETTER TO PM MODI

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన మల్లికార్జున ఖర్గే

Kharge Letter To PM Modi
Congress President Mallikarjun Kharge (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 10, 2025 at 3:29 PM IST

1 Min Read

Kharge Letter To PM Modi : లోక్​సభ డిప్యూటీ స్పీకర్​ పదవి ఖాళీగా ఉంటడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పదవికి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.

'లోక్​సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగా ఉండటం ప్రజాస్వామ్య సూత్రాలను విరుద్ధం. అలాగే రాజ్యాంగంలోని నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు అవుతుంది. మొదటి నుంచి 16వ వరకు అన్ని లోక్​సభల్లో డిప్యూటీ స్పీకర్​ ఉన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తప్పనిసరి. స్పీకర్​ తర్వాత లోక్​సభలో రెండో అత్యున్నత స్థానం డిప్యూటీ స్పీకర్​దే. కొత్తగా ఏర్పడిన లోక్​సభ రెండో లేదా మూడో సమావేశంలో డిప్యూటీ స్పీకర్​ను ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్​ను నియమించడం సంప్రదాయం' అని లేఖలో ఖర్గే పేర్కొన్నారు.

స్వతంత్ర భారతదేశ చరిత్రలో వరుసగా రెండు పర్యాయాలు ఈ పదవి ఖాళీగా ఉండటం ఇదే మొదటిసారి మల్లికార్జున ఖర్గే అన్నారు. 17వ లోక్​సభలో ఈ పదవికి ఎన్నిక జరగలేదని, ప్రస్తుతం కొనసాగుతున్న 18వ ​సభలోనూ ఇదే కొనసాగుతోందని పేర్కొన్నారు. ముందుగా చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని సభ సంప్రదాయాలకు, మన పార్లమెంట్ ప్రజాస్వామ్య సూత్రాలను అనుగుణంగా వెంటనే లోక్​సభ డిప్యూటీ స్పీకర్​ను ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.