Honeymoon Couple Missing Mystery: హానీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అదృశ్యమైన ఇందౌర్ జంట కేసును సీబీఐకి అప్పగించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కేంద్రాన్ని కోరారు. సోనమ్, రఘువంశీ ఘటనలో బాధిత కుటుంబానికి తాము అండగా నిలబడతామని సీఎం యాదవ్ పేర్కొన్నారు. నవదంపతుల అంశంపై మేఘాలయ సీఎంతో తాను ఇప్పటికే మాట్లాడినట్లు ఆయన వివరించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ అధికారులు, మేఘాలయ ప్రభుత్వ యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని కూడా మోహన్ యాదవ్ చెప్పారు.
రఘువంశీ హత్య, సోనమ్ అదృశ్యంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసినట్లు సీఎం మోహన్ యాదవ్ వివరించారు. సోనమ్‌ను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
संकट की इस घड़ी में मध्यप्रदेश श्रीमती सोनम रघुवंशी के परिवार के साथ खड़ा है। मैंने इस संबंध में मेघालय के मुख्यमंत्री से चर्चा की है। मध्यप्रदेश के वरिष्ठ पुलिस अधिकारी मेघालय के अधिकारियों के साथ निरंतर संपर्क में हैं। इस प्रकरण में सीबीआई जाँच आदेशित करने हेतु मैंने माननीय…
— Dr Mohan Yadav (@DrMohanYadav51) June 7, 2025
వీడని మిస్టరీ
మేఘాలయలో ఇందౌర్ జంట అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. భార్య సోనమ్‌తో కలిసి హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన రాజా రఘువంశీ మృతదేహం ఇటీవలే దొరికింది. ఆయన భార్య సోనమ్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటికొచ్చింది. ఆ వీడియోలో ఆమె ధరించిన చొక్కానే, అనంతరం ఆమె భర్త మృతదేహం వద్ద గుర్తించారు. సీసీటీవీ దృశ్యాల్లో కన్పించిన స్కూటర్‌ను కూడా ఘటనా స్థలానికి సమీపంలోనే గుర్తించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. తాజా ఆధారాలతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
इंदौर के कपल राजा रघुवंशी और सोनम रघुवंशी का शिलांग से एक और वीडियो. (Credits : T7News) #indorecouplemissing #SonamRaghuvanshi #rajaraghuvanshi pic.twitter.com/mUebaRdwhq
— PIYUSH SINGH RAJPUT (@piyush629) June 7, 2025
కిడ్నాప్ చేశారా?
సోనమ్‌ను కిడ్నాప్ చేసి ఉంటారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనమ్‌తో వివాహం జరగ్గా, 20న హనీమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. అయితే, ఈ జంట మే 22న ఓ ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకొని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నట్లు మేఘాలయ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని అక్కడ పార్క్ చేసి అక్కడే ఉన్న ప్రసిద్ధిగాంచిన 'లివింగ్ రూట్' వంతెనను చూసేందుకు వెళ్లారని తెలిపారు. రాత్రి అక్కడ బస చేసి, మర్నాడు ఉదయం బయటకు వెళ్లారని వివరించారు. ఆ తర్వాత నుంచి వీరి ఆచూకీ తెలియరాలేదు. 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో గుర్తించారు. అతడిని ఎవరో కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన భార్య ఆచూకీ ఇంకా దొరకలేదు.
హనీమూన్‌కు వెళ్లి డాక్టర్ దంపతులు మృతి.. పెళ్లైన పది రోజులకే..
హనీమూన్‌కు వెళ్లిన వ్యాపారవేత్త జంట మిస్సింగ్- ఏమైందో తెలియక అంతా టెన్షన్ టెన్షన్!