ETV Bharat / bharat

కార్లతో సమానంగా AC ఉద్గారాలు- 2035 నాటికి రెట్టింపు : సర్వే

ఏసీ కార్బన్ ఉద్గారాలపై సర్వే- కార్లతో సమానంగా ఏసీ ఉద్గారాలు

India AC Emissions 2025 :
India AC Emissions 2025 : (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : September 15, 2025 at 10:09 PM IST

2 Min Read
Choose ETV Bharat

India AC Emissions 2025 : 2030 నాటికి భారతదేశంలో అత్యధిక గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల చేసే గృహోపకరణాలుగా ఏసీలు మారతాయని ఓ సర్వే తెలిపింది. అంతేకాకుకండా 2035 నాటికి మొత్తం ఉద్గారులు రెండింతలు పెరిగి 329 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్​కు సమానంగా చేరుతాయని దిల్లీ కేంద్రంగా ఉన్న థింక్ ట్యాంక్ iFOREST తాజా సర్వేలో వెల్లడించింది.

'2024లో మాత్రమే ఏసీల వల్ల 156 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు విడుదలయ్యాయి. ఇది దేశంలోని అన్ని ప్రయాణీకుల కార్ల ఉద్గారాలకు సమానం. ఇందులో 52 మిలియన్ టన్నులు రిఫ్రిజిరేటర్ల లీకేజీల వల్ల వచ్చాయి. జాతీయ రిఫ్రిజరెంట్ డేటాబేస్ ఏర్పాటు చేసి, ఉద్గారాలను తగ్గించడానికి కఠినంగా అమలు చేయాలి. ఈ చర్యల ద్వారా రానున్న దశాబ్దంలో 500 నుంచి 650 మిలియన్ టన్నుల కార్బన ఉద్గారాలను నివారించవచ్చు. ఇవి 25-33 బిలియన్ డాలర్లు ఉంటాయి. కార్బన్ క్రెడిట్ల విలువత పాటు వినియోగదారులకు 10 బిలియన్ డాలర్ల రీఫిల్లింగ్ ఖర్చులను ఆదా చేస్తాయి' అని నివేదిక తెలిపింది.

భారత్​లో ఒక ఏసీని రెండు సంవత్సరాలకోసారి రీఫిల్ చేస్తే, అది ఒక కారు విడుదల చేసే ఉద్గారాలంత నష్టం చేస్తుందని iFOREST అధ్యక్షుడు చంద్ర భూషణ్ తెలిపారు. 'వాతావరణ మార్పులకు ఏసీ కూడా కారు మాదిరిగానే హానికరం. ప్రజలు ఎనర్జీ ఎఫిషెన్సీ పట్ల జాగ్రత్తగా ఉన్నారు కానీ రిఫ్రిజిరేటర్ల విషయంలో అవగాహన తక్కువ. ప్లాస్టిక్‌లకు ఉన్నట్లే రిఫ్రిజిరేటర్ల లైఫ్‌సైకిల్‌పై కూడా సమగ్ర నియంత్రణ అవసరం' అని భూషణ్ అన్నారు.

'AC వినియోగం వేగంగా పెరుగుతోంది'
సర్వే ప్రకారం, భారత్​లో ఏసీల సంఖ్య 2024లో 62 మిలియన్ ఉన్నాయి. 2035 నాటికి 245 మిలియన్​కు పెరుగనుంది. వార్షిక విక్రయాలు 14 మిలియన్ నుంచి 40 మిలియన్​కు పెరుగుతాయి. 2020 నుంచి ఏసీ అమ్మకాలు సంవత్సరానికి 15-20శాతం వృద్ధి సాధిస్తున్నాయి. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 3,100 కుటుంబాల సర్వే ప్రకారం,80శాతం ఏసీలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగివి ఉన్నాయి. 87శాతం కుటుంబాలు ఒక్క ఏసీ కలిగి ఉంటే, 13శాతం కుటుంబాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నాయి. చెన్నై, జయపుర్, కోల్‌కతా, పుణెలో బహుళ ఏసీ వినియోగం ఎక్కువగా ఉంది.

రిఫిల్ రేట్లు ప్రపంచంలోనే అత్యధికం
భారత్‌లో 40శాతం ఏసీలు ప్రతి సంవత్సరం రీఫిల్ (సాధారణంగా 5 సంవత్సరాలకు ఒకసారి చేయాలి). 5 ఏళ్లకు పైబడిన ఏసీలలో 80శాతం ఏటా రీఫిల్ అవసరం.కొత్త ఏసీలలో కూడా మూడో వంతు యంత్రాలు రీఫిల్ అవసరం అవుతున్నాయి. 2024లో వినియోగదారులు రీఫిల్‌ల కోసం రూ.7,000 కోట్లు ఖర్చు చేశారు. ఇది 2035 నాటికి రూ.27,540 కోట్లకు పెరుగుతుందని అంచనా.

రిఫ్రిజరెంట్ల ప్రమాదం
HFC-32 దేశంలో విస్తృతంగా వాడుతున్న రిఫ్రిజిరేటర్. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే 675 రెట్లు అధిక వేడి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.లీకేజీ కారణంగా ఉద్గారాలు 2024లో 52 మిలియన్ టన్నులు కాగా, 2035 నాటికి 84 మిలియన్ టన్నులు పెరుగుతాయని అంచనా. సగటున కుటుంబాలు రోజుకు 4 గంటలు ఏసీలు వాడుతున్నారు. వేసవిలో వినియోగం 7.7 గంటలు, వర్షాకాలంలో 3.2 గంటలు. 98శాతం కుటుంబాలు 3 నుంచి 5 స్టార్ రేటింగ్ ఏసీలు వాడుతున్నారు. 67శాతం కుటుంబాలు 23-25 డిగ్రీల మధ్య టెంపరేచర్ ఉంచుతారు.