India Pakistan Ceasefire :భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయాత్నాలను కొనసాగించాలని ఇరుదేశాల సైనికాధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగానే వీటిని కొనసాగించాలని భారత్, పాక్ సైనికాధికారులు ఇందుకు అంగీకరించినట్లు సమాచారం.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. ప్రతిదాడులు చేసేందుకు పాక్ ప్రయత్నించినప్పటకీ, భారత్ రక్షణ దళాలు వాటిని తిప్పికొట్టాయి. దీంతో పాక్ ఉద్రిక్తతలు తగ్గించాలని భారత్‌ను కోరింది. అందుకు భారత్ అంగీకరించగా, మే 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ అంశంలో సైన్యంలోని డీజీఎంవో స్థాయి అధికారులు కీలకంగా వ్యవహరించారు. పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ వీరి మధ్య పరస్పర అవగాహనతో ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది.
మే 12న ఇరుదేశాల డీజీఎంవోల మధ్య చర్చలు జరిగాయి. అందులో ఇరుపక్షాలు ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపకూడదని, కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు. శత్రుత్వ చర్యలు తీసుకోకూడదనే విషయాలకు కట్టుబడి ఉండాలనే దానిపై చర్చించారు. అదేవిధంగా సరిహద్దులు, ఫార్వర్డ్ బేస్ ప్రాంతాల్లో బలగాల తగ్గింపును పరిగణించాలని నిర్ణయించారు. అయితే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకే చర్చలు జరగాల్సి ఉంది. కానీ, సాయంత్రానికి వాయిదా పడ్డాయి.
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి పర్యటకులపై కాల్పులు జరిపారు. పహల్గాం ఉగ్రదాడిలో దానికి ప్రతీకారంగా పాక్ స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. అయితే ఈ దాడుల్లో100మందికి పైగా ఉగ్రవాదుల మరణించినట్లు తెలుస్తోంది.