Amit Gupta IAS Limca Book Of Records : ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా బదిలీలు, ప్రమోషన్లు సాధారణమే. అయితే ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఓ ఐఏఎస్ మాత్రం 15 సంవత్సరాల సర్వీసులో ఏకంగా 14 సార్లు బదిలీ అయ్యారు. దీంతో ఎక్కువ జిల్లాల్లో పనిచేసిన కలెక్టర్‌గా రికార్డు సాధించారు. ఈ నేపథ్యంలో అసలు ఆ ఐఏఎస్ ఎవరు? అన్నిసార్లు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? కారణాలు ఏంటి? తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి
ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2000వ బ్యాచ్ ఐఏఎస్ అమిత్ కుమార్ గుప్తా స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్. ఈయన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేట్, పబ్లిక్ అఫైర్స్‌లో పీజీ పూర్తి చేశారు. 2000లో సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. తొలుత మేరఠ్ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆగ్రాలో జాయింట్ మేజిస్ట్రేట్‌గా పనిచేశారు.

ఫస్ట్ జాబ్ అక్కడే
అమిత్ గుప్తా మొదటిసారి 2005లో హమీర్‌పుర్‌కు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత లలిత్‌పుర్ కలెక్టర్‌గా కేవలం 8రోజులే సేవలందించారు. అమిత్ కెరీర్ ఎక్కువ కాలం కలెక్టర్‌గా పనిచేసింది బదౌన్ జిల్లాలోనే. అక్కడ రెండున్నరేళ్లు పనిచేశారు. తన 15 ఏళ్ల ఉద్యోగ జీవితంలో 14 సార్లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో 2015లో ఎక్కువ జిల్లాల్లో(14) మేజిస్ట్రేట్‌గా పనిచేసినందుకు ఆయన పేరు లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్‌లో నమోదైంది.

అదనపు బాధ్యతలు అప్పగించిన యూపీ సర్కార్
కాగా, ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ సోమవారం రాత్రి 33 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అయితే ప్రస్తుతం స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న అమిత్ గుప్తాకు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. గతంలో యూపీ ప్రభుత్వంలో సాంకేతిక విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, వైద్య విద్య కార్యదర్శి, సీఎం ప్రత్యేక కార్యదర్శిగా కూడా సేవలందించారు అమిత్ గుప్తా.
#NewProfilePic pic.twitter.com/Wdxxbx191v
— Amit Gupta (@Amitguptaias) November 24, 2023
Waah Taj! pic.twitter.com/h1iHNM1pjk
— Amit Gupta (@Amitguptaias) April 10, 2022
14 జిల్లాల్లో కలెక్టర్ సేవలు
కాగా, అమిత్ గుప్తా ఇప్పటివరకు ఆగ్రా, హమీర్పుర్, లలిత్‌పుర్, కన్నౌజ్, జలౌన్, ఫిరోజాబాద్, ప్రతాప్‌గఢ్, మహరాజ్ గంజ్, ఇటావా, బదౌన్, ఫిలీబిత్, బిజ్నౌర్, శ్రావస్తి, లఖింపుర్ ఖేరీ జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు.
#NewProfilePic pic.twitter.com/8YuNfkAV5y
— Amit Gupta (@Amitguptaias) January 26, 2022