ETV Bharat / bharat

ఇంట్లోనే ఘుమఘుమలాడే "ఉడిపి​ సాంబార్"​ - ఇడ్లీ, వడల్లోకి సూపర్​ కాంబినేషన్​ - ఇలా చేసేయండి! - Udupi Sambar Recipe - UDUPI SAMBAR RECIPE

Udupi Sambar Recipe: ఉడిపి హోటల్లో ఇడ్లీ, వడతో కాంబినేషన్​గా అందించే.. వేడివేడి సాంబార్​ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలా మంది ఉడిపి హోటల్లో టిఫెన్​ చేయడానికి ఇష్టపడతారు. మీకు కూడా ఈ సాంబార్​ అంటే ఇష్టమా..! అయితే, ఇంట్లోనే ఉడిపి సాంబార్​ని ప్రిపేర్​ చేసుకోండి.

Udupi Sambar Recipe
How to Make Udupi Sambar Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 8, 2024, 5:33 PM IST

Updated : Aug 9, 2024, 3:19 PM IST

How to Make Udupi Sambar at Home: దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో సాంబార్​ రుచి.. ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. అయితే, అందరూ ఇష్టపడే, అందరికీ నచ్చే సాంబార్​ ఏదైనా ఉందంటే.. అది ఉడిపి సాంబార్ మాత్రమే!​ మనలో చాలా మంది ఈ సాంబార్​తో వేడివేడి అన్నం, ఇడ్లీ, వడలు తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఇక చాలా మందికి దీన్ని ఇంట్లో తయారు చేయాలని ఉంటుంది. కానీ ఆ ప్రాసెస్​ ఏంటో తెలియక చేయడం మానేస్తారు. అయితే ఇకపై అలాంటి అవసరం లేదు. ఎందుకంటే మేము చెప్పే ఈ పద్ధతి ఫాలో అయితే.. కర్ణాటక స్పెషల్​ డిష్​ ఉడిపి​ సాంబార్​​ ఇంట్లోనే రెడీ అయిపోద్ది. మరి ఆ ప్రాసెస్​ ఏంటో చూద్దామా..

కావాల్సిన పదార్థాలు :

  • కంది పప్పు - కప్పు
  • క్యారెట్​ ముక్కలు - కప్పు
  • గుమ్మడికాయ ముక్కలు - రెండు కప్పులు
  • మునగకాయ ముక్కలు - కప్పు
  • వంకాయలు - 3
  • పచ్చిమిర్చి - 5
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చింతపండు- 50 గ్రాములు
  • దాల్చిన చెక్క- కొద్దిగా
  • శనగపప్పు- టేబుల్​స్పూన్
  • మిరియాలు- టేబుల్​స్పూన్
  • మినపప్పు- టేబుల్​స్పూన్
  • ఎండు మిరపకాయలు -10
  • మెంతులు- టేబుల్​స్పూన్
  • జీలకర్ర - టేబుల్​స్పూన్
  • బెల్లం- అరకప్పు
  • పసుపు- టీ స్పూన్​
  • కొత్తిమీర - కొద్దిగా
  • నీరు సరిపడా
  • ఎండు కొబ్బరి తరుము - అరకప్పు

తాళింపు కోసం

  • కొబ్బరి నూనె - 1 టేబుల్​ స్పూన్​
  • ఆవాలు - 1 టీ స్పూన్​
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • కరివేపాకు - 3 రెమ్మలు
  • ఇంగువ పొడి - టీ స్పూన్​
  • ఎండుమిర్చి - 3

ఉడుపి సాంబార్​ తయారు చేసే విధానం :

  • ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా పసుపు వేసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే చింతపండు రసం తయారు చేసుకున్న తర్వాత.. దానిని స్టౌపై పెట్టాలి. ఇక్కడ మనం సాంబార్​ పుల్లగా లేకుండా చూసుకోవాలి. మనకు ఎంత సాంబార్​ కావాలో అందుకు తగినట్లుగా చింతపండు, నీళ్లను తీసుకోవాలి.
  • ఇందులోకి పచ్చిమిర్చి, వంకాయలు, టమాటాలు, క్యారెట్​, మునక్కాడలు, గుమ్మడికాయ ముక్కలు, బెల్లం, కొద్దిగా ఉప్పు వేసి 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు మరొక పాన్​లో కొద్దిగా ఆయిల్​ వేసి దాల్చిన చెక్క, శనగపప్పు, మిరియాలు, ఎండు మిరపకాయలు, మినపప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీ జార్లో, కొబ్బరి తురుము వేసి నీళ్లు పోసుకుంటూ పల్చగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఉడుకుతున్న చింతపండు రసంలో కొద్దిగా పసుపు వేయాలి. తర్వాత ఉడికించుకున్న కందిపప్పు మిశ్రమం, రెడీ చేసుకున్న కొబ్బరి పేస్ట్​ వేసి బాగా కలపాలి. సాంబార్​ చిక్కగా ఉంటే కొన్ని నీళ్లు పోసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత సగం మూత పెట్టి ఉడికించుకోండి.
  • ఈలోపు తాళింపు కోసం పాన్​లో కొబ్బరి నూనె వేసిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకుని సాంబార్​లో కలుపుకుంటే సరిపోతుంది.
  • తర్వాత స్టౌ ఆఫ్​ చేసుకుని కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన ఉడిపి స్టైల్​ సాంబార్​ రెడీ.
  • ఇక్కడ మనం చేసింది ప్యూర్​ టిఫెన్​ స్టైల్​ ఉడిపి సాంబార్​.. మీరు అన్నంలోకి చేసుకోవాలనుకుంటే.. బెల్లం, దాల్చిన చెక్కను తక్కువగా వేసుకోవాలి.
  • నచ్చితే మీరు కూడా ఈ సాంబార్​ ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

కర్ణాటక స్పెషల్ బిసిబెలా బాత్​ను వండేయండిలా!

అతిథులు మెచ్చే కల్యాణ రసం.. కమ్మగా చేసేయండిలా

నిమిషాల్లో ప్రిపేర్​ అయ్యే ఆంధ్ర స్టైల్​ "పప్పు చారు" - ఇలా చేస్తే తినడమే కాదు తాగేస్తారు కూడా!

Last Updated : Aug 9, 2024, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.