Pakistan Golden Temple Attack : 'ఆపరేషన్ సిందూర్'కు వ్యతిరేకంగా ఇటీవల పాక్ జరిపిన క్షిపణి, వైమానిక దాడులను భారత సాయుధ దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ధైర్యసాహసాలు, పరాక్రమంతో శత్రుదేశ దాడులను అడ్డుకున్నాయి. పాక్ క్షిపణులు, డ్రోన్లను మన ఎల్-70, ఆకాశ్ తదితర గగనతల రక్షణ వ్యవస్థలు అద్భుతరీతిలో నేలమట్టం చేశాయి. సరిహద్దు రాష్ట్రాల్లోని అనేక నగరాలకు హాని జరగకుండా భారత సైన్యం కాపాడింది. అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత అక్కసుతో అమృత్ సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని పాక్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులను ఎలా అడ్డుకున్నామో 15 పదాతిదళ విభాగం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి వెల్లడించారు.
#WATCH | Amritsar, Punjab: Indian Army shows debris of Pakistan-launched missiles that were intercepted and taken down by Indian Air Defence systems. pic.twitter.com/dxH1mDOpHU
— ANI (@ANI) May 19, 2025
గోల్డెన్ టెంపుల్‌పై అటాక్‌కు ప్లాన్!
"ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం గోల్డెన్ టెంపుల్ వంటి మతపరమైన ప్రదేశాలతో సహా భారత పౌర, సైనిక స్థావరాలను పాక్ లక్ష్యం చేసుకుంటుందని భారత సైన్యం ఊహించింది. పాక్ సైన్యానికి ఎటువంటి చట్టబద్ధమైన లక్ష్యాలు లేవని తెలుసు. గోల్డెన్ టెంపుల్‌ను లక్ష్యంగా చేసుకొనే అవకాశాలు కనిపించాయి. ముందుగానే ఊహించడంతో స్వర్ణ దేవాలయానికి అదనపు రక్షణ కల్పించాం. మే8న తెల్లవారుజామున గోల్డెన్ టెంపుల్ లక్ష్యంగా పాక్ డ్రోన్లు, దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించింది. ముందే సిద్ధమై ఉన్న ఇండియన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ పాకిస్థాన్ సైన్యం ప్రణాళికలను తిప్పికొట్టింది. స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేశారు." అని మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి వెల్లడించారు.
#WATCH | Amritsar, Punjab: Major General Kartik C Seshadri, GOC, 15 Infantry Division says " ...consequent to pak army sponsored dastardly terrorist attack on innocent tourists both domestic and international, nation's anger under able leadership took the form of operation sindoor… https://t.co/y9gECbSao1 pic.twitter.com/sqInnRRK4M
— ANI (@ANI) May 19, 2025
'పహల్గాం దాడి వల్లే ఆపరేషన్ సిందూర్'
పహల్గాంలో అమాయక భారత, విదేశీ పర్యటకులే లక్ష్యంగా జరిపిన ఉగ్రదాడి ఫలితంగానే ఇండియా 'ఆపరేషన్ సిందూర్' చేపట్టిందని కార్తిక్ తెలిపారు. ఇందులో భాగంగా పాక్, పీఏకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసిందని వివరించారు. తొమ్మిది స్థావరాలలో, ఏడింటిని భారత సైన్యం ప్రత్యేకంగా నాశనం చేసిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలు సంపూర్ణ ఖచ్చితత్వంతో అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్న మురిద్కే, బహవల్పూర్ వంటి ప్రాంతాలపై దాడి చేశాయని అన్నారు. భారత సైన్యం పాకిస్థాన్ సైనిక, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు.
"ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదు కొనసాగుతోంది. పాక్ కవ్వింపులకు పాల్పడితే గట్టి ప్రతిస్పందన తప్పదు. పాక్ సైన్యం లోపాలు, ఎదుర్కొన్న ఒత్తిడి గురించి తెలుసు. పాక్ సైన్యం ఏవైనా దాడులకు యత్నిస్తే వినాశకరమైన ప్రతిస్పందనను ఇస్తాం. అవసరమైతే పాకిస్థాన్‌ను పూర్తిగా నాశనం చేస్తాం." అని కార్తిక్ తెలిపారు.
సైనికులపై స్థానికులు ప్రశంసలు
మరోవైపు, పాకిస్థాన్ దాడుల నుంచి తమ ప్రాణాలు కాపాడినందుకు అమృత్ సర్ ప్రజలు ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత సాయుధ దళాలతో భుజం భుజం కలిపి నిలబడతామని పేర్కొన్నారు. గోల్డెన్ టెంపుల్ సహా సరిహద్దు ప్రాంతాలలోని మతపరమైన ప్రదేశాలను రక్షించడానికి సైన్యం అన్ని ప్రయత్నాలను చేసిందని కొనియాడారు. సాయుధ దళాలకు ప్రజలు తమ సామర్థ్యాల మేరకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికుడు ఒకరు తెలిపారు. ఇండియన్ ఆర్మీ స్వర్ణ దేవాలయం, నగరంలోని కొన్ని ప్రాంతాలను రక్షించిందని అన్నారు.
ISIకి వ్యాపారి 'ఆల్ ఇన్ వన్' సపోర్ట్- యూపీలో పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్
సరిహద్దు ప్రాంతాల్లో సైన్యం స్పెషల్ ఆపరేషన్- పేలని బాంబులు, అర్టిలరీ నిర్వీర్యం