ETV Bharat / bharat

'రాహుల్​ గాంధీ భారతీయుడా? బ్రిటన్ పౌరుడా?- 4 వారాల్లో తేల్చేయండి' - RAHUL GANDHI CITIZENSHIP

రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి 4 వారాల గడువు- తదుపరి విచారణ ఏప్రిల్ 21కి వాయిదా

Rahul Gandhi
Rahul Gandhi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : March 24, 2025 at 9:03 PM IST

1 Min Read

Rahul Gandhi Citizenship : కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పౌరసత్వం అంశంలో కేంద్ర ప్రభుత్వానికి అలహాబాద్‌ హైకోర్టు గడువు నిర్దేశించింది. నాలుగు వారాల్లో పౌరసత్వం అంశం తేల్చాలని సూచించింది. అయితే కేంద్రం- న్యాయస్థానానికి 8 వారాల గడువు కోరగా, నాలుగు వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణను లఖ్‌నవూ బెంచ్‌ ఏప్రిల్‌ 21కి వాయిదా వేసింది. ఆ లోగా స్టేటస్‌ రిపోర్ట్‌ను కేంద్రం కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.

పౌరసత్వంపై రగడ
రాహుల్‌ గాంధీ పౌరసత్వం అంశంపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. రాహుల్‌ గాంధీ బ్రిటన్‌ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యర్త విఘ్నేశ్‌ శిశిర్ వేసిన పిటిషన్లపై న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది.

బ్రిటన్‌లో నమోదైన ఓ కంపెనీకి రాహుల్‌ గాంధీ డైరెక్టర్, సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి కొంత కాలంగా ఆరోపిస్తూనే ఉన్నారు. ఆ కంపెనీ వార్షిక నివేదికలో తనను తాను బ్రిటిష్‌ పౌరుడిగా రాహుల్​ గాంధీ పేర్కొన్నట్లు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. వేరే దేశంలో పౌరుడిగా ఉన్న వ్యక్తి భారత దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందన్నారు. అలా చేయకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 9, భారతీయ పౌరసత్వ చట్టం, 1955ని ఉల్లంఘించడమే అవుతుందని స్వామి పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలో కేంద్రానికి కూడా ఆయన లేఖ రాశారు. మరోవైపు తన వద్ద రాహుల్‌గాంధీ పౌరసత్వానికి సంబంధించి యూకే ప్రభుత్వం సమర్పించిన రికార్డులు ఉన్నాయని విఘ్నేశ్‌ చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.