ETV Bharat / bharat

'ప్రస్తుతాన్ని వదిలేసిన మోదీ సర్కార్- 2047 గురించి కలలు కంటోంది'- రాహుల్ గాంధీ - CONGRESS ON PM MODI

మోదీ సర్కార్​పై మండిపడ్డ కాంగ్రెస్- మోదీ 11 ఏళ్ల పాలనలో ప్రచారం మాత్రమే ఉందని వెల్లడి

Kharge On PM Modi
Rahul Gandhi (PTI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 9, 2025 at 4:33 PM IST

2 Min Read

Rahul On PM Gandhi Modi : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోదీ సర్కార్ 11ఏళ్ల పాలనలో ఎటువంటి జవాబుదారీతనం లేదని, ప్రచారం మాత్రమే ఉందని ఆరోపించారు. ప్రస్తుతం గురించి మాట్లాడటం మానేసి, ఇప్పుడు 2047 కలలు కంటోందని ఆరోపించారు. మహారాష్ట్రలోని ఠాణెలో రద్దీగా ఉన్న లోకల్‌ రైలు నుంచి జారిపడి నలుగురు మరణించడం, ఆరుగురు గాయపడడంపై రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో కేంద్రం తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

'రైల్వేలు అందుకు చిహ్నంగా మారాయి'
"మోదీ ప్రభుత్వం 11ఏళ్ల పాలన సంబరాలు జరుపుకుంటుండగా, ముంబయి నుంచి వస్తున్న విషాద వార్త దేశ వాస్తవికత ప్రతిబింబిస్తుంది. రైలు నుండి పడి అనేక మంది మరణించారు. భారతీయ రైల్వేలు కోట్లాది మంది జీవితాలకు వెన్నెముక. కానీ నేడు అభద్రత, రద్దీ, గందరగోళానికి చిహ్నంగా మారింది. మోదీ సర్కార్ 11 ఏళ్ల పాలనలో జవాబుదారీతనం, మార్పు లేదు. ప్రచారం మాత్రమే ఉంది. 2025 గురించి మాట్లాడటం మానేసి, 2047 గురించి మాట్లాడుతోంది. ఠాణె రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి." అని రాహుల్ గాంధీ ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.

కేంద్రంపై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
గత 11ఏళ్లలో మోదీ ప్రభుత్వం దేశ ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ కొట్టిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అలాగే రాజ్యాంగంలోని ప్రతి పేజీలో నియంతృత్వ సిరాను మాత్రమే పూసిందని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ పోస్ట్ లో మోదీ సర్కార్ పై మండిపడ్డారు.

"దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థలను బీజేపీ, ఆర్ఎస్ఎస్​లు బలహీనపరిచి, వాటి స్వయంప్రతిపత్తిపై దాడి చేశాయి. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లి ప్రభుత్వాలను కూల్చేసిన పార్టీ బీజేపీ. గత 11 ఏళ్లలో రాష్ట్రాల హక్కులను కాషాయ పార్టీ విస్మరించింది. అలాగే సమాఖ్య నిర్మాణం బలహీనపడింది. ద్వేషం, బెదిరింపులు, భయానక వాతావరణాన్ని వ్యాప్తి చేయడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి."
-- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

'వారి హక్కులను హరించేందుకు కుట్ర'
గత 11 ఏళ్లలో దేశంలో ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీలు, మైనార్టీలు, బలహీన వర్గాలపై దోపిడీ పెరిగిందని ఖర్గే ఆరోపించారు. వారి రిజర్వేషన్లు, సమాన హక్కులను హరించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. మణిపుర్‌ లో కొనసాగుతున్న హింస బీజేపీ పరిపాలనా వైఫల్యానికి అతిపెద్ద సాక్ష్యమన్నారు. యూపీఏ హయాంలో సగటున 8 శాతంగా ఉన్న దేశ జీడీపీ వృద్ధి రేటును 5-6 శాతం వద్ద ఉంచడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్​లు అలవాటుగా మార్చుకున్నాయని మండిపడ్డారు.

"ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీని నెరవేర్చడానికి బదులుగా, యువత నుంచి ఏటా కోట్లాది ఉద్యోగాలు లాక్కుంటున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజా పొదుపులు 50ఏళ్లలో అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక అసమానతలు గత 100 ఏళ్లలో అత్యధికంగా ఉన్నాయి. నోట్ల రద్దు, జీఎస్​టీ, ప్రణాళిక లేని లాక్‌ డౌన్ అసంఘటిత రంగాన్ని దెబ్బతీశాయి. కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును నాశనం చేశాయి. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, నమామి గంగే, 100 స్మార్ట్ సిటీలు వంటి కార్యక్రమాలు విఫలమయ్యాయి. భారతీయ రైల్వే నాశనమైంది. కాంగ్రెస్ (యూపీఏ) శ్రమించి నిర్మించిన మౌలిక సదుపాయాల రిబ్బన్లను మాత్రమే మోదీ కత్తిరిస్తున్నారు." అని ఖర్గే విమర్శించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.