Ayodhya Ram Mandir Gold : అయోధ్య రామాలయ రెండోవిడత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జూన్ 5న కనులపండువగా సాగింది. గురువారం మొదటి అంతస్తులో రామ దర్బార్ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ రాజదర్బారులో సీతా సమేతంగా రాజు హోదాలో అయోధ్య రాముడు కొలువుదీరాడు. ఈ వేడుకల నేపథ్యంలో ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా కీలక అంశాలు వెల్లడించారు. రామ మందిర నిర్మాణంలో వినియోగించిన పసిడి విలువ పేర్కొన్నారు.
అయోధ్య రామ మందిరం నిర్మాణంలో మొత్తం 45 కిలోల మేలిమి బంగారం వినియోగించినట్లు నృపేంద్ర శర్మ తెలిపారు. ఈ ఆలయ నిర్మాణంలో వినియోగించిన పుత్తడి విలువ దాదాపు రూ.50 కోట్లు (టాక్స్లు మినహాయించి) ఉంటుందని అన్నారు. మందిరంలోని గ్రౌండ్ ఫ్లోర్ తలుపులు, రాముడి సింహాసనంలో బంగారాన్ని అధికంగా ఉపయోగించారు.
కాగా, శేషావతార్ ఆలయంలో బంగారం పని ఈ రోజుకీ జరుగుతోందని శర్మ తెలిపారు. రామాలయం ప్రధాన నిర్మాణాలు ఇప్పటికే పూర్తైనా, ఆలయ సముదాయంలోని ఆడిటోరియం, మ్యూజియం, అతిథి గృహం వంటివి ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. ఈ నిర్మాణాలు 2025 డిసెంబర్ నాటికి పూర్తి కావొచ్చని భావిస్తున్నారు.
दक्षिणे लक्ष्मणो यस्य वामे तु जनकात्मजा।
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) June 5, 2025
पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनम्॥
जिसके दाहिने लक्ष्मण हैं, बाएँ जनकनंदिनी सीता हैं, और जिसके सम्मुख पवनपुत्र हनुमान हैं, मैं उन रघुकुलनंदन श्रीराम को नमस्कार करता हूँ।
On whose right stands Lakshmana, on whose left Sita ji, and… pic.twitter.com/Nbh5lnuKiY