ETV Bharat / bharat

పిల్లలు రోజూ వైట్​ రైస్​ ఎలా తింటారు మమ్మీ? - ఈ కలర్​ ఫుల్​ 'గార్లిక్ రైస్' పెట్టండి - మెతుకు మిగలదు! - Garlic Rice Recipe In Telugu

Garlic Rice Recipe In Telugu : చాలా మంది పిల్లలు స్కూల్​ నుంచి లంచ్​ బాక్స్​ ఖాళీ చేయకుండా పట్టుకొస్తుంటారు. మీ పిల్లలు కూడా ఇలాగే తెస్తున్నారా? వారికి రొటీన్ వైట్​ రైస్​ బోర్ కొట్టినట్టుంది! అందుకే.. కాస్త వెరైటీగా "గార్లిక్​ రైస్​" ప్రిపేర్ చేసి పెట్టండి. మెతు కూడా మిగలకుండా తినేస్తారు! మరి.. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 1:48 PM IST

How To Make Garlic Rice Recipe
Garlic Rice Recipe In Telugu (ETV Bharat)

How To Make Garlic Rice Recipe : పిల్లలకు లంచ్​ బాక్స్ రెడీ చేయడం తల్లులకు సవాలే. చాలా మంది పిల్లలు తినకుండానే బాక్స్ ఇంటికి మోసుకొస్తుంటారు. అది చూసి.. పిల్లలు సరిగా తినట్లేదని అమ్మలు ఆవేదన చెందుతుంటారు. మీ పిల్లలు కూడా చేస్తున్నా.. లేదంటే వెరైటీగా ఏదైనా కావాలని అడుగుతున్నా.. ఒక్కసారి ఈ 'గార్లిక్ రైస్' ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఎంతో టేస్టీగా ఉండే దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. లంచ్​ బాక్స్​లోకే కాదు.. మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​గా(Breakfast)గా కూడా ఈ రైస్ పనిచేస్తుంది. మరి.. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

గార్లిక్ రైస్​కి కావాల్సిన పదార్థాలు :

  • 1 కప్పు - బియ్యం
  • పావు కప్పు - వెల్లుల్లి
  • పావు కప్పు - తరిగిన క్యారెట్ ముక్కలు
  • 4 టేబుల్ స్పూన్లు - బీన్స్ ముక్కలు
  • మూడు టేబుల్ స్పూన్లు - నూనె
  • పావు టీస్పూన్ - మిరియాల పొడి
  • పావు టీస్పూన్ - వైట్ పెప్పర్ పొడి
  • 1 టీస్పూన్ - సోయా సాస్
  • 1 టీస్పూన్ - వెనిగర్
  • 1 టీస్పూన్ - స్ప్రింగ్ ఆనియన్స్
  • అర టీస్పూన్ - ఒరిగానో
  • రుచికి సరిపడా - ఉప్పు

హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ - ప్రిపరేషన్​ వెరీ ఈజీ- పల్లీ చట్నీతో తింటే టేస్ట్ వేరే లెవల్!

గార్లిక్ రైస్ తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక రైస్​ను.. మెత్తగా కాకుండా పొడిపొడిగా ఉండేలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే వెల్లుల్లి రెబ్బల పొట్టు తొలగించి స్మాల్ పీసెస్​గా కట్ చేసుకోవాలి.
  • వీటితో పాటు బీన్స్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్​ను కూడా చిన్న చిన్న ముక్కలు తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టౌ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక అందులో.. కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను వేసి వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగించుకోకుండా.. గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే బౌల్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత అందులోనే మరికాస్త ఆయిల్ పోసుకొని క్యారెట్, బీన్స్ ముక్కలను వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేగకుండా చూసుకోవాలి.
  • వీటిని ఫ్రై చేసుకున్నాక.. వేయించి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, ఉడికించుకున్న రైస్ అందులో వేసి మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మిరియాల పొడి, వైట్ పెప్పర్ పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై.. సోయా సాస్, వెనిగర్ యాడ్ చేసుకొని మరోసారి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి.
  • చివరగా.. సాల్ట్ సరిపోయిందో లేదో రుచి చూసుకుంటే సరిపోతుంది. అంతే.. రుచికరమైన గార్లిక్ రైస్ మీ ముందు ఉంటుంది.
  • ఈ సారి తప్పకుండా ట్రై చేయండి.. పిల్లలు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు.

బ్రెడ్​తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.