5 Flavours Ippa Puvvu Tea : ఇప్పచెట్టు- అడవి తల్లి గిరిజనులకు ఇచ్చిన ఓ వరం అనడంలో అతిశయోక్తి లేదు. విశేష ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టు పండ్లు, పవ్వు, విత్తనాలతో గిరిజనులు అనేక ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ముఖ్యంగా ఇప్పపువ్వుతో సారా తయారు చేయడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పపువ్వుతో చేసిన టీకి కూడా ఇప్పుడు డిమాండ్ పెరిగింది. కొందరు ఔత్సాహికులు ఇప్పపువ్వు ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి ఇప్పపువ్వు జనరిక్ టీని తయారు చేస్తున్నారు. మానవ శరీరం పంచాభూతాలతో తయారైందని అంటారు. అలా ఈ టీలో పంచభూతాల పేర్లతో 5 ఫ్లేవర్లను తయారు చేస్తున్నారు. ఈ ఇప్పపువ్వు టీ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ దట్టమైన అడవులు, అటవీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బస్తర్ అడవులలో కనిపించే ఇప్పపువ్వు(మహువా) స్థానిక గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరు. సాధారణంగా స్థానిక గిరిజనులు ఇప్పపువ్వు నుంచి సారా తయారు చేస్తారు. కానీ బస్తర్‌లో, గత కొన్నేళ్లుగా ఇప్పపువ్వు టీ, లడ్డులను కూడా తయారు చేస్తున్నారు. వీటికి దేశవ్యాప్తంగా డిమాండ్ కూడా పెరిగింది.

రజియా షేక్ అనే ఔత్సాహిరాలు ఈ ఇప్పపువ్వు ఆధారిత 'బస్తర్ ఫూడ్స్' అనే సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థలో ఏడుగురు మహిళలు పనిచేస్తున్నట్లు రజియా తెలిపారు. తన కంపెనీలో చేరాలనుకునే పాఠశాల, కళాశాల పిల్లలు తనతో చేరవచ్చని రజియా షేక్ అన్నారు. బస్తర్ నగరానికి ఆనుకుని ఉన్న నెంగిగూడలో ఈ ఇప్పపువ్వు ప్రాసెసింగ్ యూనిట్ ఉందని తెలిపారు.
'పంచభూతాల టీ ఫ్లేవర్లు'
దీపం పటేల్ అనే మరో ఔత్సాహికుడు కూడా 'ఓ ఫారెస్ట్' అనే ఇప్పపువ్వు ఆధారిత సంస్థను ప్రారంభించాడు. అందులో- నింగి, నేల, నిప్పు, నీరు, ఆకాశం- పంచభూతాల పేర్లతో 5 ఫ్లేవర్లను తయారు చేస్తున్నారు. "మేము ఒక ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాము. ఆ సమయంలో ఒక యువకుడు మాకు ఇప్పపువ్వు, బస్తర్‌ను పరిచయం చేశాడు. అలా నేను ఇప్పపువ్వు గురించి తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు, ఇందులో మంచి భవిష్యత్తు కనిపించింది. అనంతరం ఈ ఫీల్డ్‌లో ఎంతో అనుభవం కలిగి ఉన్న రజియా షేక్‌ను కలిశాము" అని ఓ ఫారెస్ట్ వ్యవస్థాపకుడు దీపమ్ పటేల్ అన్నాడు.

ఇప్పపువ్వు టీ ఆరోగ్య ప్రయోజనాలు
రక్తహీనత, థైరాయిడ్, శరీర నొప్పి, కంటి చూపు లోపం వంటి వాటికి ఇప్పపువ్వు టీ తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రజియా షేక్ చెప్పారు. ఇప్పపువ్వు టీలో ఎక్కువ ఖనిజాలు, కాల్షియం, విటమిన్లు లభిస్తాయని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం బస్తర్‌లో 450 మంది రైతులు ఈ ఇప్పపువ్వు టీతో అనుబంధం కలిగి ఉన్నారని తెలిపారు. గతంలో ఇద్దరే ఈ పని చేసేవారని పేర్కొన్నారు.

విదేశీయులు ఫిదా
ఇప్పపువ్వు నుంచి తయారు చేసిన టీని అంతర్జాతీయ వేదికపై జనరిక్ టీగా పరిచయం చేశారు. ఈ మేరకు ఆ టీని ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రావు మద్ది లాంఛ్ చేశారు. దీంతో ఇది బస్తర్ గిరిజనులకు ఆదాయ వనరుగా మారింది. అయితే ఈ ఇప్పపువ్వు టీ వల్ల ఎలాంటి హాని ఉండదని తయారీదారులు చెబుతున్నారు. విదేశీయులు కూడా ఈ టీని రుచి చూస్తున్నారు, చాలా ఇష్టపడుతున్నారని చెప్పారు.

పెంపుడు కుక్క మృతిపై న్యాయపోరాటం- ఏడాదిన్నర తర్వాత దక్కిన విజయం!
10th స్టేట్ టాపర్‌కు బ్లడ్ క్యాన్సర్ - సాయం చేయాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్!