ETV Bharat / bharat

లేడీ కానిస్టేబుల్​పై లైంగిక వేధింపులు!- రెండేళ్లల్లో 3అబార్షన్లు- పరారీలో నిందితుడు

బిహార్​లో పోలీసులను ఆశ్రయించిన మహిళ కానిస్టేబుల్- తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సహోద్యోగిపై ఫిర్యాదు

Constable Sexual Harassment Case
Constable Sexual Harassment Case (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 1, 2025 at 11:30 AM IST

2 Min Read
Choose ETV Bharat

Constable Sexual Harassment Case : లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ సహోద్యోగిపై ఫిర్యాదు చేసింది ఓ మహిళ కానిస్టేబుల్. ఈ ఘటన బిహార్​లో జరిగింది. గత రెండేళ్లుగా పెళ్లి చేసుకుంటాని మోసం చేస్తూ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నారని ఆరోపించింది. అంతేకాకుండా ఈ రెండేళ్లలో వివిధ కారణాలు చెప్పి మూడు సార్లు అబార్షన్ చేయించినట్లు ఫిర్యాదులో వాపోయింది.

అసలేం జరిగిదంటే?
ఫిర్యాదులో తెలిపిన వివరాలు ప్రకారం, బాధిత మహిళ బక్సార్​ జిల్లాలో ఉద్యోగం చేస్తోంది. నిందితుడు గయా జిల్లాకు చెందిన కానిస్టేబుల్. ఇద్దరికి ఫిబ్రవరి 2023లో జరిగిన ఓ క్యాంపస్‌లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె నంబర్​ తీసుకుని ఫోన్​లో తరుచుగా మాట్లాడేవాడు. 2023 ఏప్రిల్​లో బాధితురాలు వారణాసికి వెళ్లినప్పుడు, నిందితుడు కూడా వచ్చాడు. అక్కడే ఓ హోటల్​ బాధితురాలితో బలవంతంగా శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఈ విషయంపై ఎదురు తిరగడంతో ఆమెను బతిమిలాడు. తన ఉద్యోగం పోతుందని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆమెను క్షమాపణలు కోరాడు.

అయితే, 2023 మేలో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు నిందితుడు, ఎవరికీ తెలియకుండా ఆమెను ఝార్ఖండ్​లోని దేవ్​గఢ్​ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు విడివిడిగా ఉండేవారు. ఆ తర్వాత నిందితుడి కుటుంబ సభ్యులను కలవాలని మహిళ కానిస్టేబుల్ అడిగినా, పలు కారణాలు చెప్పి వాయిదా వేసేవాడు. త్వరలోనే తన కుటుంబానికి పరిచయం చేస్తానని చెప్పి ముందులు ఇచ్చి గర్భాన్ని తొలిగించాడు. అలా రెండేళ్లల్లో మూడు సార్లు గర్భం దాల్చింది. ప్రతిసారి ఏదొక కారణం చెప్పి దానిని తొలగించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే 2025 మేలో నిందితుడు మరో మహిళను పెళ్లి చేసుకున్న విషయం తెలియడంతో బాధితురాలు మోసం పోయినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది.

నిందితుడు సస్పెండ్
బాధిత మహిళ ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు డుమ్రాన్ పోలీసులు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.

దివ్యాంగ సోదరులపై లైంగిక వేధింపులు- సిగరెట్​తో కాల్చి, ఐరన్ రాడ్​తో దాడి

ఎయిర్‌ హోస్టెస్‌పై ఆస్పత్రి సిబ్బంది లైంగిక దాడి- వెంటిలేటర్‌పై ఉన్నప్పుడే!