Jammu And Kashmir Encounter : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్రో లష్కరే తయ్యిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. పుల్వామా జిల్లాలోని థ్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురుకాల్పులతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది.
Chinar Corps of the Indian Army tweets, " on 15 may 2025, based on specific intelligence input from int agency, a cordon & search operation was launched by indian army, j&k police and srinagar sector crpf at nader, tral, awantipora. suspicious activity was observed by vigilant… pic.twitter.com/trKQPgNkhN
— ANI (@ANI) May 15, 2025
48 గంటల్లో రెండో ఎన్‌కౌంటర్
మరోవైపు, జమ్ముకశ్మీర్‌లో 48 గంటల్లో ఎన్‌కౌంటర్ జరగడం ఇది రెండోసారి. మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్‌పాథర్ కెల్లర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కరే తయ్యిబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు. కశ్మీర్ లోయలో పలు దాడులకు పాల్పడినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. అయితే దీనికి భద్రతా బలగాలు ఆపరేషన్ కెల్లర్ అని పేరు పెట్టాయి.