Jaish Terrorist Encounter Video : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన సైన్యం, ఆ దిశలో ముందుకు సాగుతోంది. ఈ మేరకు పుల్వామా జిల్లాలోని థ్రాల్‌లో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహ్మద్ ముఠాకు చెందిన ముష్కరులను హతమార్చింది. అందులో ఒక ఉగ్రవాదిను ముట్టబెట్టిన డ్రోన్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అసలేం జరిగందంటే?
థ్రాల్ ప్రాంతంలోని నదిర్ గ్రామంలో ఉగ్రవాదుల కదిలికలపై నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టింది. అప్పుడే ఉగ్రవాదులు కాల్పులు జరపగా, వెంటనే ఎన్కౌంటర్ మొదలైంది. కొన్ని గంటలపాటు కాల్పులు జరిగాయి. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా దళాలు. వారిని ఆసిఫ్ అహ్మద్ షేక్, అమిర్ నజిర్ వని, యావర్ అహ్మద్ భట్‌గా గుర్తించాయి.
అయితే ఎన్కౌంటర్ సమయంలో ఒక ఉగ్రవాది నిర్మాణంలో ఉన్న భవనంలోని బేస్మెంట్కు వెళ్లి దాకున్నాడు. దీంతో అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు కనుగొనేందుకు భద్రతా దళాలు డ్రోన్ కెమెరాను రంగంలోకి దించాయి. అప్పుడు ముష్కరుడు ఓ పిల్లర్ చాటున ఉన్నట్టు గుర్తించి చుట్టుముట్టాయి. ఆ తర్వాత మట్టుబెట్టాయి. ఆ దృశ్యాలు డ్రోన్ కెమెరాలో రికార్డవ్వగా, ఇప్పుడు వైరల్ అయ్యాయి.
📍The hunt continues
— OsintTV 📺 (@OsintTV) May 15, 2025
Tral Encounter Drone Shot
Sabko chun chunkar marenge, terrorists days are numbered
Video source- @AnuveshRath pic.twitter.com/ODYQ1jCnhb
కాగా, గత రెండు రోజుల్లో రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో గురువారం జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు టాప్ లష్కరే ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరిని షహిద్ కుట్టా, అద్నాన్ షఫిగా గుర్తించాయి. షహిద్ 2023లో లష్కరేలో చేరగా, గతేడాది ఏప్రిల్‌లో ఓ రిసార్ట్ వద్ద కాల్పుల ఘటనకు అతడే బాధ్యుడు. అప్పుడు ఇద్దరు జర్మనీ పర్యటకులు, వారి డ్రైవర్ గాయపడ్డారు.
ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతీకారంగా షహిద్ ఇంటిని భద్రతా దళాలు పేల్చేశాయి. మరోవైపు, ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యటకులపై ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపిన అనంతరం అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వీరికోసం భద్రతా సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.
మణిపుర్లో కాల్పులు- 10మంది మిలిటెంట్లు హతం
పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన 'ఆకాశ్‌తీర్'- సత్తా చాటిన 'మేకిన్ ఇండియా' గగనతల రక్షణ వ్యవస్థ!