Momos Preparation with Dogs Meat : మీకు ఫాస్ట్‌ఫుడ్ అంటే చాలా ఇష్టమా? రెస్టారెంట్లు, హోటళ్లలో లభించే చికెన్‌తో చేసిన పదార్థాలు తింటున్నారా? అయితే, వెంటనే జాగ్రత్తపడితే బెటర్. ఎందుకంటే చికెన్‌కు బదులుగా కుక్క, పిల్లిని పోలిన మాంసాన్ని వీటి తయారీలో వాడుతుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని మొహాలీలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది
మొహాలీలోని మాటూర్ గ్రామంలోని ఓ ఇంట్లో కొన్ని రోజులుగా నూడుల్స్ తయారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికలకు వీరిపై అనుమానం వచ్చి పరిశీలించగా ప్రమాదకర రీతిలో ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలింది. నూడుల్స్‌ను బాత్రూమ్లోని నేలపై పరిచినట్లు, మోమో తయారీలో చికెన్‌కు బదులుగా కుక్క, పిల్లిని పోలిన మాంసాన్ని వాడినట్లు బయటపడింది. ఇందులోకి వాడిన క్యాబెజీ చెడిపోయినట్లు తేలింది. దీనికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఈ వీడియోపై స్పందించిన అధికారులు దుకాణానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. షాపులోని పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం యజమాని పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిని ఛండీగఢ్, మొహాలీ, పంచకుల లాంటి ప్రదేశాలకు పంపిస్తున్నట్లు తెలిపారు.