ETV Bharat / bharat

బిన్​ లాడెన్​ను అంతమొందించిన తరహాలో ఆపరేషన్ సిందూర్​ : ఉప రాష్ట్రపతి - JAGDEEP DHANKHAR OPERATION SINDOOR

ఒసామా బిన్ లాడెన్​ను అంతమొందించిన ఆపరేషన్​ నెప్ట్యూన్ స్పియర్ తరహాలో ఆపరేషన్​ సిందూర్​ - భారత ఉప రాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​ కీలక వ్యాఖ్యలు

Jagdeep Dhankhar  On Operation Sindoor
Jagdeep Dhankhar On Operation Sindoor (ANI (File Image))
author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2025 at 2:49 PM IST

2 Min Read

Jagdeep Dhankhar On Operation Sindoor : ఆపరేషన్ సిందూర్​పై భారత ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉగ్రవాది బిన్‌ లాడెన్‌ను అమెరికా వేటాడి అంతమొందించిన ఘటనతో ఆపరేషన్‌ సిందూర్‌ను పోల్చారు. భారత్‌ మునుపెన్నడూ లేని విధంగా పాకిస్థాన్​లోకి చొచ్చుకొని వెళ్లి మరీ ఉగ్రమూకలను ఏరిపారేసిందని చెప్పారు. 2 మే 2011న అమెరికా దళాలు ఇదేవిధంగా వ్యవహరించాయని లాడెన్ పేరు ప్రస్తావించకుండా ధన్​ఖడ్​ మాట్లాడారు.

"ప్రపంచానికి తెలిసేలా భారత్ చేసి చూపించింది. శాంతియుత వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉగ్రవాదుల్ని తుదముట్టించడం ద్వారా ఒక గ్లోబల్ బెంచ్‌ మార్క్‌ను సెట్ చేసింది" అని ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ధన్‌ఖడ్‌ అన్నారు. భారత్‌ ఎంతో కచ్చితత్వంతో దాడులు చేసిందని, ఉగ్ర శిబిరాలకు మాత్రమే నష్టం వాటిల్లిందని చెప్పారు.

అమెరికా చరిత్రలో అత్యంత విషాద ఘటనగా మిగిలిన ఘటన- వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై 11 సెప్టెంబర్‌ 2001లో (9/11) అల్‌ఖైదా జరిపిన ఉగ్ర దాడి. ఈ దాడిలో దాదాపు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో అమాయకులను పొట్టన పెట్టుకున్న అల్‌ఖైదా అధినేత బిన్‌ లాడెన్‌ను 2011 మే 2న అమెరికా దళాలు ప్రత్యేక 'ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్​'​ చేసి హతమార్చాయి. యూఎస్‌ నేవీ సీల్‌ బృందం ప్రత్యేక కమాండో ఆపరేషన్‌ చేపట్టి అబొట్టాబాద్‌ కాంపౌండ్‌లో నక్కిన లాడెన్‌ను మట్టుబెట్టింది. ఈ అపరేషన్​కు అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బరాక్‌ ఒబామా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

'తుర్కియే ఆర్థిక వ్యవస్థ మెరుగుపరడం- మనం భరించలేం'
దిగుమతుసు లేదా ప్రయాణం ద్వారా భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమైన దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రజలు సహాయం చేయొద్దని జగ్​దీప్​ ధన్​ఖడ్​ అన్నారు. ముఖ్యంగా బిజినెస్, కామర్స్​, పరిశ్రమలు భద్రతా సమస్యలతో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌కు- తుర్కియే, అజర్​బైజాన్​ మద్దతు ఇచ్చాయి. దీంతో ఆ దేశాలకు బాయ్​కాట్​ సెగ తాగింది. ఆ దేశాలతో వాణిజ్యం, పర్యటకాన్ని బహిష్కరించాలని సోషల్ మీడియా ట్రెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ధన్​ఖడ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

"మన ప్రయోజనాలకు విరుద్ధమైన దేశాలను మనం శక్తివంతం చేయగలమా? మనలో ప్రతి ఒక్కరూ ఆర్థిక జాతీయవాదం గురించి లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. దిగుమతి, ప్రయాణం ద్వారా అలాంటి దేశాల ఆర్థికాన్ని మెరుగుపరచడం ఇకపై మనం భరించలేము. ఆ దేశాలు సంక్షోభ సమయాల్లో మనకు వ్యతిరేకంగా ఉంటాయి" అని ధన్​ఖడ్ అన్నారు.

కాంగ్రెస్​ పంపిన లిస్ట్​లో శశిథరూర్ లేకున్నా ఎంపిక చేసిన కేంద్రం - ఎందుకిలా?

ముంబయిలో ఇద్దరు టెర్రరిస్ట్​ స్లీపర్ సెల్స్​​ అరెస్ట్​- ఎయిర్​పోర్ట్​లో అదుపులోకి తీసుకున్న NIA

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.