Arvind Kejriwal Dance : దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమార్తె హర్షిత వివాహం శుక్రవారం గ్రాండ్‌గా జరిగింది. దిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్లో నిశ్చితార్థం, సంగీత్ వేడుకలు జరిగాయి. కూతురు వివాహ వేడుకల్లో కేజ్రీవాల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సతీమణి సునీతతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు.
'పుష్ప 2' సినిమాలోని 'సూసేకి' హిందీ వెర్షన్ పాటకు ఆయన స్టేప్పులేస్తూ ఈవెంట్లో సందడి చేశారు. వీళ్లతోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, కేజ్రీవాల్ కుమార్తె హర్షిత పెళ్లి తన స్నేహితుడు సంభవ్ జైన్‌తో ఘనంగా జరిగింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌తో సహా పార్టీ నాయకులు, పలువురు రాజకీయ ప్రముఖులు పెళ్లికి హాజరయ్యారు. ఎప్పుడు సింపుల్‌గా ఉంటే కేజ్రీవాల్ కూతురు పెళ్లిలో షేర్వాణీ ధరించి గ్రాండ్ లుక్‌లో కనిపిస్తున్నారు.
Kejriwal dance in his daughters wedding!
— North East West South (@prawasitv) April 18, 2025
Harshita daughter of Arvind Kejriwal ties knot with Sambhav Jain in a lavish wedding at Hotel Shangrila in Delhi!
Punjab CM Mann was highlight at the wedding!#ArvindKejriwal #harshita #sanbhav #AamAadmiParty #punjabcm pic.twitter.com/XbJBalXOHA