ETV Bharat / bharat

లంకా దహనం చేసిన హనుమంతుడే మాకు ఆదర్శం: రాజ్‌నాథ్‌ సింగ్‌

'ఆపరేషన్ సిందూర్'పై రాజ్​నాథ్ రియాక్షన్- హనుమంతుడి ఆదర్శంతోనే ఇదంతా!

Rajnath Singh On Operation Sindoor
Rajnath Singh On Operation Sindoor (Source : ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2025 at 5:44 PM IST

2 Min Read
Choose ETV Bharat

Rajnath Singh On Operation Sindoor : 'ఆపరేషన్ సిందూర్​'లో లంకా దహనం చేసిన హనుమంతుడే తమకు ఆదర్శమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్​ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినందుకు భారత సైన్యాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన 'ఆపరేషన్ సిందూర్'​కు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో భారత సాయుధ దళాలు అందరినీ గర్వపడేలా చేశాయని రక్షణ మంత్రి అన్నారు. నిన్న రాత్రి భారత సాయుధ దళాలు తమ శౌర్యం, ధైర్యాన్ని ప్రదర్శించి కొత్త చరిత్రను సృష్టించాయన్నారు. భారత సాయుధ దళాలు కచ్చితత్వం, అప్రమత్తతతో వ్యవహరించాయని నిర్దేశించిన లక్ష్యాలను సరైన సమయంలో కచ్చితత్వంతో నాశనం చేశాయన్నారు.

హనుమంతుడే ఆదర్శం!
అంతేకాకుండా, సైన్యం మానవత్వంతో వ్యవహరించిందని, పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవడంలో భారత సాయుధ దళాలు జాగ్రత్త ఉన్నాయన్నారు. యావత్ దేశం తరపున సైనికులు, అధికారులను అభినందిస్తున్నట్లు చెప్పారు. సాయుధ దళాలకు మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అశోక వనానికి వెళ్ళేటప్పుడు హనుమంతుడు అనుసరించిన సూత్రాన్ని ఈ దాడిలో తాము అనుసరించినట్లు రాజ్​నాథ్ చెప్పారు. తమ అమాయక ప్రజలను చంపిన వారిని మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ మంత్రి అన్నారు. తన గడ్డపై జరిగిన దాడికి ప్రతిస్పందించే హక్కును భారత్​కు ఉందని రాజ్​నాథ్ చెప్పారు. ఈసారి కూడా, మునుపటిలాగే తగిన సమాధానం భారత్ ఇచ్చినట్లు వివరించారు.

మౌలిక వసతులకు ప్రాధాన్యత
సరిహద్దుల్లో మౌలికవసతులు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. భారత్‌లో అనేక దేశాల సంస్కృతులు కనిపిస్తాయని, భారత సంస్కృతి కూడా అనేక దేశాల్లో విస్తరించి ఉన్నదని చెప్పారు. వేల సంవత్సరాలుగా అనేక దేశాలతో మైత్రీభావంతో ఉన్నామని, భారత్‌కు వివిధ మార్గాల్లో అరబ్బులు, యూరోపియన్లు వచ్చారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతులు పెంచేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి మంత్రి స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా 'హై అలర్ట్'- ఆ రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా ఎమర్జెన్సీ మీటింగ్!

ఆపరేషన్ సిందూర్​పై క్యాబినెట్ ప్రశంసలు- కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు