ETV Bharat / bharat

అత్యంత ఘోర విమాన ప్రమాదాలివే- ఎంతో మందిని బలిగొన్న దుర్ఘటనలు - AHMEDABAD PLANE CRASH

భారత్‌, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో విమాన విషాదాలు

ahmedabad plane crash 2025
ahmedabad plane crash 2025 (PTI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 12, 2025 at 5:54 PM IST

5 Min Read

Ahmedabad Plane Crash 2025 : గుజరాత్‌లోని అహ్మదాబాద్​లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం (AI 171) సర్దార్ వల్లాభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వే 23 నుంచి లండన్‌ గాట్విక్‌ ఎయిర్‌పోర్టుకు గురువారం (జూన్ 12న) మధ్యాహ్నం 1.39 గంటలకు బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తి కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో 242 మంది ప్రయాణికులు సహా సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా జరిగిన అత్యంత ఘోరమైన విమానయాన విషాదాలపై ‘ఈటీవీ భారత్’ కథనమిది.

భారత్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదాలివీ

2 విమానాలు ఢీ- 349 మంది మృతి : 1996 నవంబరు 12న హరియాణాలోని చర్ఖి దాద్రీ వద్ద గగనతలంలోనే సౌదీ అరేబియన్ ఎయిర్ లైన్స్, కజకిస్తాన్ ఎయిర్ లైన్స్ విమానాలు ఢీకొన్నాయి. దీంతో ఆ విమానాల్లోని మొత్తం 349 మంది చనిపోయారు.

విమానంలో ఖలిస్థానీల బాంబు- 329 మంది మృతి : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం 182ను కనిష్క అని పిలిచేవారు. ఇది కెనడాలోని టొరంటో నుంచి దిల్లీకి 1985 జూన్ 23న బయలుదేరింది. ఈ విమానంలో ఖలిస్థానీ ఉగ్రవాదులు రహస్యంగా బాంబుపెట్టారు. అట్లాంటిక్ మహాసముద్రం పైనుంచి విమానం వెళ్తుండగా బాంబు పేలింది. దీంతో విమానంలోని మొత్తం 329 మంది ప్రయాణికులు చనిపోయారు.

అరేబియాలో కూలిన విమానం 213 మంది మృతి : 1978 జనవరి 1న ఎయిర్ ఇండియా విమానం ‘ఏఐ855’ ముంబయిలోని బాంద్రా తీరంలో అరేబియా సముద్రంలో కూలింది. రాత్రి 8 గంటలకు ముంబయిలోని శాంటా క్రజ్ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్‌కు బయలుదేరిన 2 నిమిషాల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానంలోని మొత్తం 213 మంది చనిపోయారు.

రన్ వే అంచును దాటిన విమానం- 158 మంది మృతి : 2010 మే 22న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ దుబాయ్ - మంగళూర్ విమానం రన్‌వే‌ అంచును దాటి దూసుకెళ్లింది. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ఘటనలో విమానంలోని 158 మంది చనిపోయారు. 8 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

గుజరాత్‌లో 130 మంది మృతి : 1988 అక్టోబరు 19న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపించగానే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 130 మంది చనిపోయారు.

విమానంలో అగ్ని ప్రమాదం- 95 మంది మృతి : 1976 అక్టోబరు 12న ముంబయిలోని ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో విమానంలోని 95 మంది చనిపోయారు.

కొండను ఢీకొట్టిన ప్లేన్- 94 మంది మృతి : 1962 జులై 7న ఇటలీకి చెందిన అలిటాలియా విమానం ముంబయిలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒక కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 94 మంది చనిపోయారు.

బెంగళూరులో 92 మంది మృతి : 1990 ఫిబ్రవరి 14న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు సమీపించగానే కూలింది. ఈ ప్రమాదంలో 142 మంది ప్రయాణికులు సహా 92 మంది చనిపోయారు.

విమానంలో మంటలు- 83 మంది మృతి : 1972 జూన్ 14న రాత్రి జపాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన డీసీ-8 విమానం దిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా మంటల్లో చిక్కుకుంది. విమానంలోని మొత్తం 89 మందిలో 83 మంది చనిపోయారు. విమానంలోని మంటల ధాటికి గ్రౌండ్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులూ మృతిచెందారు. విమానంలోని మంటలు ఎయిర్‌పోర్టు సమీపంలోని జైత్‌పూర్ గ్రామానికీ విస్తరించాయి.

ప్రపంచ దేశాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదాలివీ

  • 1977 మార్చి 27న స్పెయిన్‌లోని లాస్ రోడియోస్‌లో ఉన్న టెనెరైఫ్ నార్త్ ఎయిర్‌పోర్ట్ వద్ద హాలండ్‌కు చెందిన కేఎల్‌ఎం ఫ్లైట్ 4085, గ్రీస్‌కు చెందిన పాన్ ఏఎం ఫ్లైట్ 1736 ఢీకొన్నాయి. ఈ రెండు విమానాలనూ లాస్ రోడియోస్‌ ఎయిర్‌పోర్టుకు దారిమళ్లించారు. పాన్ ఏఎం ఫ్లైట్ 1736 విమానం లాస్ రోడియోస్‌ ఎయిర్‌పోర్టు వైపుగా వస్తోంది. ఇదే సమయంలో కేఎల్ఎం విమానం క్లియరెన్స్ తీసుకోకుండానే టేకాఫ్ తీసుకుంది. ఇవి రెండూ గగనతలంలో ఎదురుపడ్డాయి. దట్టమైన పొగమంచు వల్ల పైలట్లు ఎదురుగా ఏముందో గుర్తించలేకపోయారు. ఈ ప్రమాదంలో 583 మంది చనిపోయారు. ఇవి రెండూ బోయింగ్ 747 విమానాలే.
  • 1985 ఆగస్టు 12న జపాన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 123 టోక్యో నుంచి ఒసాకాకు బయలుదేరింది. ఈ ఘటనలో విమానంలోని 524 మందిలో 520 మంది చనిపోయారు. విమానం తోక భాగాన్ని బోయింగ్ టెక్నీషియన్లు సరిగ్గా రిపేర్ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు.
  • 1974 మార్చి 3న ఇస్తాంబుల్ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌ శివార్లలో ఉన్న ఎర్మెనో విల్లే అడవుల్లో కూలింది. విమానంలోని 346 మంది చనిపోయారు.
  • 1980 ఆగస్టు 19న సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న ఎయిర్‌పోర్టు రన్‌వే‌‌పై లాక్ హీడ్ ఎల్-1011 విమానం ఉంది. అయితే అకస్మాత్తుగా విమానంలో పొగలు వ్యాపించాయి. ఆ పొగను పీల్చుకొని విమానంలోని మొత్తం 301 మంది చనిపోయారు.
  • 1979 మే 25న మధ్యాహ్నం డీసీ-10 విమానం అమెరికాలోని చికాగోలో ఉన్న ఓహేర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరింది. అయితే ఈ విమానంలోని ఎడమ ఇంజిన్, రెక్క భాగం నుంచి తెగిపోయి కింద పడింది. దీంతో విమానం అదుపుతప్పి గింగిరాలు తిరిగింది. చివరకు రన్ వే నుంచి ఒక మైలు దూరంలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 272 మంది చనిపోయారు.
  • 2018 ఏప్రిల్ 11న అల్జీరియాలో రష్యాకు చెందిన ఇల్యూషిన్ రకం సైనిక రవాణా విమానం కూలింది. బౌఫారిక్ విమానాశ్రయానికి సమీపంలోని ఒక పొలంలో విమానం పడిపోయింది. ఈ ఘటనలో 257 మంది చనిపోయారు.
  • మలేషియా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 370 2014 మార్చి 8న మలేషియాలోని కౌలలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్‌కు బయలుదేరింది. అయితే ఈ విమానం రాడార్ తెర నుంచి మాయమైంది. బోయింగ్ 777 రకానికి చెందిన ఈ విమాన ప్రమాదంలో 239 మంది చనిపోయారని ప్రకటించారు.
  • 1998 సెప్టెంబరు 2న స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్ ఎయిర్ ఫ్లైట్ 111 అమెరికాలోని న్యూయార్క్ నుంచి స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు బయలుదేరింది. విమానం తోక భాగం నుంచి పొగ వాసన వస్తుండటాన్ని తొలుత గుర్తించారు. 65 మైళ్ల దూరంలో కెనడాలోని నోవా స్కాటియాలో ఉన్న హాలీ ఫ్యాక్స్‌‌కు విమానాన్ని తీసుకెళ్లి దింపాలని పైలట్లు భావించారు. పైలట్లు తీవ్రంగా శ్రమించి విమానాన్ని నోవా స్కాటియాకు 5 మైళ్ల దూరం వరకు తీసుకెళ్లారు. ఇంకొన్ని నిమిషాలైతే హాలీ ఫ్యాక్స్‌‌‌లో విమానాన్ని దింపొచ్చని భావించారు. అయితే అప్పటికే విమానంలో వేగంగా మంటలు వ్యాపించాయి. దీంతో మార్గం మధ్యలో అట్లాంటిక్ సముద్రంలో విమానం కూలిపోయింది. అందులోని 229 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2009 జూన్ 1న ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 బ్రెజిల్‌లోని రీయో డీ జెనీరియో నుంచి ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌కు బయలుదేరింది. మార్గం మధ్యలో విమానానికి తీవ్ర పిడుగుపాట్లు ఎదురయ్యాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు పైలట్లు విమానాన్ని దాదాపు 38వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లారు. మరీ అంత ఎత్తుకు చేరాక విమానంలోని ఏరో డైనమిక్ వ్యవస్థ దెబ్బతింది. చివరకు విమానం దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో కూలింది. దీంతో అందులోని 228 మంది చనిపోయారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.