Karnataka Daughter In Law Murder : పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగడం లేదనే కారణంతో కోడలిని అత్యంత దారుణంగా హతమార్చారు అత్తామామలు. కోడలి తలపై బండరాయితో కొట్టి ఆపై మెడకు చీర బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బెళగావి జిల్లాలోని అథాని తాలుక్ మలబాద్ గ్రామానికి చెందిన సంతోష్ హొనకాండే, రేణుక దంపతులు. వివాహం జరిగి చాలా సంవత్సరాలు గడిచిన వీరికి సంతానం కలగలేదు. దీంతో తరచూ వీరిద్దరితో పాటు అత్తామామలతో గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కోడలిని అంతమొందించాలని భర్త అతడి తల్లిదండ్రులు భావించారు. ఈ నెల 17న రాత్రి ఎనిమిది గంటల సమయంలో రేణుకను ఆమె అత్తామామలు కామన్నా హొనకాండే, జయశ్రీలు కలిసి వారి బైక్పై ఎక్కించుకొని మలబాద్ గ్రామ సమీపానికి తీసుకెళ్లారు. అక్కడ మొదట బండరాయితో తలపై మోదారు. తర్వాత చీర మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారని ఎస్పీ బీమ్శంకర్ గులేద్ తెలిపారు.
ఆ తర్వాత బైక్ చట్రాల్లో చీర ఇరుక్కొని చనిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేశారని పోలీసులు చెప్పారు. ఇందుకోసం హత్య జరిగిన ప్రాంతం నుంచి కొంత దూరం ఈడ్చుకెళ్లి బైక్పై నుంచి పడిపోయినట్లుగా ప్రమాద దృశ్యాలు సృష్టించారని వెల్లడించారు. ఈ హత్యలో భర్త హస్తం కూడా ఉందని తెలియడంతో వారి అత్తామామలతో పాటు భర్తను కలిపి అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపినట్లు ఎస్పీ బీమ్శంకర్ గులేద్ తెలిపారు.
వివాహితను గొంతు కోసి దారుణ హత్య
ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఎవరూ లేని సమయంలో లోపలికి ప్రవేశించి గొంతుకోసి పరారయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉల్వా ప్రాంతంలో నివాసం ఉంటున్న వివాహితను దుండగులు గొంతుకోసి హతమార్చారు. భర్త ఫిర్యాదు మేరకు దీనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బెంగళూరులో దంచికొడుతున్న వర్షాలు- గోడకూలి మహిళ మృతి
మహిళ బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టిన జవాన్- వీడియో తీసి లైంగిక వేధింపులు