ETV Bharat / bharat

MPల జీతాలు, అలవెన్స్​లు పెంపు- నెలకు ఎంతంటే? - MP SALARY HIKE

ఎంపీల వేతనాలు 24 శాతం పెంపు- నోటిఫై చేసిన కేంద్రం

MP Salary Hike
MP Salary Hike (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : March 24, 2025 at 5:05 PM IST

1 Min Read

MPs Salaries Hike : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎంపీల జీతాలు, డైలీ అలవెన్స్, పెన్షన్, అదనపు పెన్షన్స్​కు​ సంబంధించి కీలక మార్పులు చేసింది. ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఎంపీల జీతాన్ని దాదాపు 24శాతం మేర పెంచుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక నోటిఫికేషన్​ విడుదల చేసింది. పెంచిన ఈ వేతనాలను 2023 ఏప్రిల్‌ 1 నుంచి వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.

ఎంపీల జీతం ఎంత పెరిగిందంటే?
తాజా పెంపుతో ఒక్కో ఎంపీ వేతనం నెలకు రూ.1లక్ష నుంచి రూ.1.24లక్షలకు పెరగనుంది. అలాగే, సిట్టింగ్‌ సభ్యుల రోజువారీ భత్యాన్ని రూ.2వేల నుంచి రూ.2,500కు పెంచుతున్నట్లు వెల్లడించింది. మాజీ పార్లమెంటు సభ్యులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్​ను రూ.25వేల నుంచి రూ.31వేలకు, అదనపు పెన్షన్‌ను నెలకు రూ.2,000 నుండి రూ.2,500కు పెంచుతున్నట్లు నోటిఫికేషన్​లో పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.