Pankaj Chaudhary on Mehul Choksi Arrest: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.వేల కోట్లు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్ట్ గొప్ప విజయమని కేంద్రం ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ అన్నారు. విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకొస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారని, ఆ హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. పేదలను దోపిడీ చేసిన వాళ్లను మోదీ వదిలిపెట్టరని తెలిపారు.
'పరారీలో ఉన్న మెహుల్ ఛోక్సీ వంటి వాళ్లను ప్రధాని మోదీ వదిలిపెట్టారు. దేశ సంపదను దోచుకుని పరారీలో ఉన్న వారిని వెనక్కి రప్పిస్తాం. పేదల డబ్బును దోచుకున్న వారు దానిని తిరిగి ఇవ్వాల్సిందే. ఇలాంటి వ్యక్తులపై మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఛోక్సీ అరెస్ట్ అతిపెద్ద విజయం. అయితే ఛోక్సీ బెయిల్ కోసం వెళ్లాలని చూస్తున్నారు. దానికి పూర్తిగా వ్యతిరేకిస్తాం' అని పంకజ్ చౌధరీ అన్నారు.
Nagpur, Maharashtra: Union Minister of State for Finance Pankaj Chaudhary on Mehul Choksi arrest in Belgium says, " the modi government has a zero-tolerance policy towards corruption and wrongdoing, and anyone who has misappropriated the wealth of the country's poor will not be… pic.twitter.com/aT5IV4fkNn
— IANS (@ians_india) April 14, 2025
'భారత్‌కు అప్పగించడం మానవ హక్కుల ఉల్లంఘనే'
మరోవైపు మెహుల్ ఛోక్సీని భారత్‌కు అప్పగించడం వల్ల మానవ హక్కులు దెబ్బతింటాయని ఆయన న్యాయవాది విజయ్ అగర్వాల్ అన్నారు. భారత్‌లో ఛోక్సీ ఆరోగ్య పరిస్థతికి సరైన చికిత్స ఉందని, అంతేకాకుండా రాజకీయ కేసుగా ఉండటం ఆయన మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు. భారత దర్యాప్తు సంస్థలకు ఛోక్సీ సహాకరిస్తూనే ఉన్నారని, అందుకే పరీరాలో ఉన్న వ్యక్తిగా పరిగణించలేమని తెలిపారు. ఈ కేసు ఎప్పుటి నుంచో ఉందని, ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా ఎప్పుడైనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నారని గతంలో తెలిపారు. అందుకోసం దాఖలు చేసిన క్లియర్ కాలేదని చెప్పారు.
ఛోక్సీపై ఉన్న ఆరోపణలివే!
2014- 2017 మధ్య కాలంలో మెహుల్ ఛోక్సీ తన సహచరులతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేశారు. బ్యాంకు అధికారులతో కుమ్మక్కై లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ (LoU), విదేశీ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (FLC) పొందారని ఆరోపణలు ఉన్నాయి. తరువాత విదేశీ క్రెడిట్లను రుణాన్ని పొందేందుకు వీటిని ఉపయోగించారని అభియోగాలు నమోదయ్యాయి.
2017 : పెట్టుబడి ప్రోగ్రామ్ కింద మెహుల్ ఛోక్సీ యాంటిగ్వా పౌరసత్వాన్ని పొందాడు.
2018 : పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ నుంచి బయటపడడానికి కొన్ని రోజుల ముందు భారత్ నుంచి పరారయ్యాడు. రుణ మోసం కేసు ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ఈడీ, సీబీఐ కీలక విషయాలను వెల్లడించాయి. మెహుల్ చోక్సీ షెల్ కంపెనీలు, విదేశాల్లోని నకిలీ సంస్థల్లో పెద్ద మొత్తంలో డబ్బును మనీలాండరింగ్ చేశాయని వెల్లడించాయి.
మెహుల్ ఛోక్సీ ఆస్తులు సీజ్ : ఈ కేసు దర్యాప్తు సందర్భంగా ఈడీ దేశంలోని 136 కంటే ఎక్కువ చోట్ల సోదాలు జరిపింది. మెహుల్ ఛోక్సీ గీతాంజలి గ్రూప్‌నకు చెందిన రూ.597.75 కోట్ల విలువైన వస్తువులు, ఆస్తులను స్వాధీనం చేసుకుంది. మరో రూ.1968.15 కోట్ల విలువైన స్థిర/చరాస్తులను అటాచ్ చేశారు. మొత్తం మీద రూ.2565.90 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు.