CBI Arrests Ex Principal Of RG Kar : బంగాల్లోని కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మరో పోలీసు అధికారిని కూడా అరెస్టు చేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో ఇప్పటికే సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. తాజాగా డాక్టర్ అత్యాచారం కేసులో సందీప్ అరెస్ట్ అయ్యారు.
సంబరాలు చేసుకున్న డాక్టర్లు :
సందీప్ ఘోష్ అరెస్ట్‌తో డాక్టర్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ జూనియర్ డాక్టర్ మాట్లాడారు. "సాక్ష్యాలను తారుమారు చేయడం వల్ల కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి అభిజిత్ మోండల్‌ను అరెస్టు చేయాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈ అరెస్ట్ ఆనందాన్ని కలిగిస్తోంది'' అని వైద్యుడు తెలిపారు.
#WATCH | Kolkata, West Bengal: A junior doctor says, " we have been demanding the arrest of the former principal of the college sandip ghosh and abhijit mondal, officer-in-charge of tala police station for their involvement in tampering with the evidence. we are very happy as the… pic.twitter.com/l9Dbx3YHHa
— ANI (@ANI) September 14, 2024
సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అభిజిత్ మండల్‌లను సీబీఐ అరెస్టు చేయడంపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుకాంత మజుందార్ స్పందించారు. "ఈ రోజు చేసిన అరెస్టులు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అరెస్టు. అత్యాచారం కేసులో అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్టయ్యారు. వాళ్లను అరెస్టు చేయాలని బంగాల్ ప్రజలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. నా ప్రశ్న ఏమిటంటే, ఒక చిన్న స్టేషన్ ఇన్‌చార్జి అలాంటి నిర్ణయం తీసుకోగలడా? ఇక బంగాల్ ప్రజలు ముఖ్యమంత్రిని ఆ పదవి నుంచి తొలగిస్తారు" అని సుకాంత మజుందార్ అన్నారు.
#WATCH West Bengal: On the arrest of former principal of RG Kar Medical College Sandip Ghosh and Tala Police Station In-charge Abhijit Mandal by CBI, Union Minister Sukanta Majumdar says, " the arrests made today are very important. especially the arrest of the station in-charge… pic.twitter.com/y7TmdwJCFy
— ANI (@ANI) September 14, 2024