Bomb Attack On Businessman In UP : నడిరోడ్డుపై ఓ వ్యాపారి కారుపై బాంబులు వేసిన భయానక ఘటన ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. ఆదివారం అర్థరాత్రి శంకర్‌గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రయాగ్‌రాజ్-రేవా రోడ్డులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ వచ్చి, వ్యాపారవేత్త వెళ్తున్న కారుపై బాంబులు విసిరారు. తరువాత వారు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అదృష్టవశాత్తు కారులో ఉన్న వ్యాపారి రవి కేశర్వానీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ బాంబు ధాటికి అతనితోపాటు, కారులో ఉన్న అయన స్నేహితుడు వేద్ ద్వివేది తీవ్రంగా గాయపడ్డారు. ఇదంతా సీసీటీవీల్లో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు చెలరేగాయి.
పాత కక్షలు!
"చక్ ఘాట్‌కు చెందిన వ్యాపారవేత్త రవి కేశర్వానీ, తన స్నేహితులు విక్కీ కేశర్వానీ, వేద్ ద్వివేద్‌లతో కలిసి ఓ ఫంక్షన్ కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళుతున్నారు. ఆయన నారి బారి చౌకీలోని తన బావమరిది రాకేశ్ కేశర్వానీ ఇంటికి చేరువలో ఉన్నారు. అప్పుడే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి, కారుపై బాంబులు వేశారు. దీనితో పెద్ద ఎత్తున మంటలు, పొగ ఆవరించాయి. వెంటనే రవి కేశర్వానీ తన కారును ఆపారు. కారులోని వారందరూ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కారులోంచి బయటకు వచ్చేశారు. ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. దాడి చేసిన నిందితులు బైక్‌పై పారిపోయారు. దాడి వల్ల రవి కేశర్వానీ, అతని స్నేహితుడు ద్వివేది తీవ్రంగా గాయపడ్డారు. దీనితో స్థానికులు వీరిని దగ్గరల్లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. బాంబు దాడి గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. రవి కేశర్వానీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే నిందితులు ఇద్దరిని పట్టుకుంటాం. ఇంతకు ముందు రవి కేశర్వాణీకి ఎవరితోనైనా వివాదం లేదా శతృత్వం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం" అని డీసీపీ వివేక్ చంద్ర యాదవ్ చెప్పారు.
గతంలోనూ ఇలానే!
2023 ఫిబ్రవరిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. రాజుపాల్ అనే వ్యక్తి హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్‌పై గుడ్డు ముస్లిం అనే వ్యక్తి బాంబు దాడి చేశాడు. తరువాత ఉమేష్‌తోపాటు, అతని గన్‌మెన్‌లు ఇద్దరినీ కాల్చి చంపాడు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు జరగడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
50రోజుల గర్భవతి! ఆ బిడ్డకు తండ్రి మొగుడా? ప్రియుడా? DNA టెస్ట్‌కు డిమాండ్
ప్రాణభయంతో 400 కుటుంబాలు పక్క జిల్లాకు- నది దాటుకుంటూ వెళ్లి స్కూల్లో తలదాచుకున్న బాధితులు!