Ayodhya Ram Darbar Opening : అయోధ్య రామాలయ నిర్మాణం జూన్ 5 నాటికి పూర్తవుతుందని శ్రీ రామ జన్మభూమి నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. రామ దర్బార్ ప్రాణప్రతిష్ఠ అదే రోజున జరుగుతుందని చెప్పారు. జూన్ 3 నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈసారి అతిథుల జాబితా భిన్నంగా ఉంటుందని నృపేంద్ర మిశ్రా అన్నారు.
"జూన్ 5న రామ దర్బార్ విగ్రహాల ప్రతిష్టాపన జరగనుంది. జూన్ 3 నుంచి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. రామాలయ సముదాయంలో మరో ఏడు దేవాలయాలు నిర్మాణం జరిగింది. వాటి ప్రతిష్ఠ కూడా జరగనుంది. జూన్ 5 నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. ఆలయ దిగువ అంతస్తులో రాముడి కథను వర్ణించే కుడ్యచిత్రాలు తప్ప మిగతా అంతా అయిపోతుంది" అని ఆయన అన్నారు.
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ లాగానే రామ్ దర్బార్ ప్రాణప్రతిష్ఠ కూడా జరగనుందా అనే ప్రశ్నకు నృపేంద్ర మిశ్రా స్పందించారు. ఆలయ ట్రస్ట్ తుది పద్ధతులపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బహుశా అతిథుల జాబితా భిన్నంగా ఉండవచ్చని తెలిపారు. పూజ చేయడానికి అక్కడికి వచ్చే పూజారులు భిన్నంగా ఉండవచ్చని అన్నారు. రాష్ట్రాలు, కేంద్రానికి చెందిన VIPలను అతిథుల జాబితాలో చేర్చమని మిశ్రా చెప్పారు. వేడుకకు ఆహ్వానించకూడదని ట్రస్ట్ నిర్ణయించిందని చెప్పారు.
'రాజకీయ లక్ష్యాలు లేవ్'
అయోధ్య రామాలయ నిర్మాణం వెనుక ఎటువంటి రాజకీయ లక్ష్యాలు లేవని మిశ్రా స్పష్టం చేశారు."ఇది ఏదైనా రాజకీయ ఉపాయం లేదా దాని వెనుక ఏదైనా రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని నేను అనుకోను. ఇది మన సుప్రీంకోర్టు ఆదేశం మేరకు జరిగింది. 500 సంవత్సరాల పోరాటం తర్వాత ఆ క్షణం వచ్చింది" అని ఆయన తెలిపారు. జూన్ 5 వేడుక జరిగిన వారంలోపు ఆలయం మొత్తాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు.
భరత్ పథ్ నిర్మాణం
మరోవైపు, అయోధ్యలో 20 కి.మీ భరత్ పథ్ను యూపీ ప్రభుత్వం నిర్మించనుంది. భరతుడు తపస్సు చేసినట్లు ప్రచారంలో ఉన్న భరత్‌కుండ్‌ను రాముడి ఆలయానికి అనుసంధానించేలా కారిడార్ నిర్మాణం చేసేందుకు ప్రతిపాదించింది. 20 కి.మీ రోడ్డు విస్తరణను రూ.900 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
రామాయణంలో భరతకుండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. రాముడు వనవాసం సమయంలో ఆయన తమ్ముడు భరతుడు 14 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు. రాముడు వనవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత, భరతుడు వారి తండ్రి దశరథుని కోసం ఈ పవిత్ర స్థలంలో పిండ ప్రదానం చేశారని చెబుతారు. భరత్ పథ్ నిర్మాణంతో భక్తులు సులభంగా చేరుకోవచ్చు.
అయోధ్యలో 76ఏళ్ల నాటి 'రాంలల్లా సింహాసనం' ప్రతిష్ఠ- భక్తులకు దర్శనం ఎప్పటినుంచంటే?
అయోధ్య రామమందిరంలోకి ముస్లిం మహిళ- అరెస్ట్ చేసిన పోలీసులు- ఎందుకంటే?