ATM Installed On Panchavati Express : ప్రయాణికుల కోసం ఏటీఎం సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సెంట్రల్ రైల్వే మొదటిసారిగా ముంబయి-మన్నాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్‌తో ప్రయోగాత్మకంగా ఓ ఏటీఎంను ఏర్పాటు చేసింది. త్వరలోనే మిగతా రైళ్లలోనూ ఇలాంటి కదిలే ఏటీఎంలు వచ్చే అవకాశం ఉంది.
"పంచవటి ఎక్స్‌ప్రెస్ ప్రతీ రోజూ నడుస్తుంది. అందుకే దీనిలో ప్రయాణించేవారి కోసం ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంను ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లో ఏర్పాటు చేశాం. ప్రస్తుతానికి దీనిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినప్పటికీ, త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ ఏటీఎం సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాం."
- స్వప్నిల్ నీలా, సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
'పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ ఛైర్‌కార్‌లో గతంలో ప్యాంట్రీ ఉండేది. ఆ స్థలంలోనే ఈ కొత్త ఏటీఎంను ఏర్పాటు చేశాం. రైలు కదులుతున్నప్పుడు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి దీనికి ఓ షట్టర్ డోర్‌ను కూడా అమర్చాం. అలాగే కోచ్‌లో ఏటీఎం ఏర్పాటుకు అవసరమైన మార్పులను మన్మాడ్ వర్క్‌షాప్‌లో చేసినట్లు' రైల్వే అధికారులు తెలిపారు.
పంచవటి ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజూ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు వెళ్లి వస్తుంటుంది. సుమారు 4.30 గంటల్లోనే ఇది గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్- రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు భర్తీ!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్- రైల్వేలో 1007 పోస్టులు- దరఖాస్తు చేసుకోండిలా!