Sunita Williams Wax Statue : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మొట్టిమొదటి మైనపు విగ్రహం ఏర్పాటైంది. అమెరికాలో ఉంటున్న ఆమె పూర్వీకులు గుజరాత్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆమె మైనపు విగ్రహాన్ని బంగాల్లోని పశ్చిమ బుర్ద్వాన్‌లో అసన్సోల్ శిల్పి సుశాంత్ రాయ్ తయారు చేశారు. తన సొంత మ్యూజియంలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి మోలోయ్ ఘటక్ చేత ఆదివారం ప్రారంభోత్సవం చేయించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ పొన్నవలం సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.
'సునీతా విలియమ్స్ విగ్రహాన్ని తయారు చేయడానికి నెలన్నర సమయం పట్టింది. కానీ విగ్రహానికి తగ్గట్లు నా దగ్గర దుస్తులు లేకపోవడంతో ఆవిష్కరించలేకపోయాను. వాటి కోసం నేను నాసాను కొంతకాలం క్రితం సంప్రదించాను. కానీ ఫలించలేదు. వారు దుస్తులు ఇవ్వలేదు. ఆ తర్వాత నా స్నేహితుడి సహాయంతో అమెరికా నుంచి వస్త్రాలు తెప్పించాను. అందుకు మరో నెల ఆలస్యమైంది' అని సుశాంత్ రాయ్ వెల్లడించారు.
సునీతా విలియమ్స్ అంతరిక్షంలో తొమ్మిది నెలలుగా పోరాడిన ఆ తర్వాత తిరిగి భూమి మీదకు వచ్చారని సుశాంత్ రాయ్ గుర్తు చేసుకున్నారు. ఆమె పోరాటాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తాను విగ్రహం తయారు చేశానని తెలిపారు. తన మైనపు మ్యూజియంకు ప్రజలు ఎప్పుడు వచ్చినా, సునీతను గుర్తుంచుకుంటారని చెప్పారు. మరోవైపు, మేజిస్ట్రేట్ ఎస్ పొన్నవలం తాను ఇక్కడకు రావడం ఇదే మొదటిసారని తెలిపారు.
'సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది'
సునీతా విలియమ్స్ విగ్రహాన్ని చూస్తుంటే సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పారు. సుశాంత్ రాయ్ దేశానికి గర్వకారణమని తెలిపారు. సుశాంత రాయ్ అసన్సోల్‌కు గర్వకారణమని సందర్శకులు చెబుతున్నారు. సునీతా విలియమ్స్ విగ్రహాన్ని చూసిన తర్వాత, 100 శాతం సరిగ్గా తయారు చేశారని నాకు అనిపించిందని పేర్కొన్నారు.
అసన్సోల్లో సుశాంత్ రాయ్ మ్యూజియం ఒక అద్భుతమని చెప్పాలి! ఆయన మ్యూజియంలో అమితాబ్ బచ్చన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సౌమిత్ర ఛటర్జీ, ఉత్తమ్ కుమార్, సుచిత్ర సేన్, షారుఖ్ ఖాన్, లతా మంగేష్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మమతా బెనర్జీ వంటి ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు సునీతా విలియమ్స్ విగ్రహం ఏర్పాటు చేశారు. కోల్కత్తాలోని మదర్ మ్యూజియం కోసం ఓ విగ్రహంతోపాటు జైపుర్లోని మరో మ్యూజియం కోసం విగ్రహం రూపొందించారు.
అంతరిక్షం నుంచి భారత్ విజన్ అద్భుతం- మత్స్యకారుల పడవలే మాకు సిగ్నల్ : సునీతా విలియమ్స్
త్వరలోనే ఇండియాకు సునీతా విలియమ్స్- 'భారత పుత్రిక'కు ప్రముఖుల స్వాగతం