కాంగ్రెస్​ను వీడుతున్న అగ్రనేతలు- బీజేపీ గూటికి మాజీ సీఎం

author img

By ETV Bharat Telugu Desk

Published : Feb 13, 2024, 12:08 PM IST

Updated : Feb 13, 2024, 1:47 PM IST

Ashok Chavan Joins BJP

Ashok Chavan Joins BJP : మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్​ చవాన్​ బీజేపీలో చేరారు. ముంబయిలోని పార్టీ కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సమక్షంలో ఆయన కమలం కండువా కప్పుకున్నారు. దీంతో ఈ రోజు(మంగళవారం) నుంచి కొత్త రాజకీయ జీవితాన్ని తాను ప్రారంభించనున్నట్లు అశోక్ వెల్లడించారు.

Ashok Chavan Joins BJP : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ బీజేపీలో చేరారు. అందరి ఊహాగానాలను నిజం చేస్తూ మంగళవారం మధ్యాహ్నం ఆయన ముంబయిలోని పార్టీ కార్యాలయంలో అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు(మంగళవారం) నుంచి కొత్త రాజకీయ జీవితాన్ని తాను ప్రారంభించనున్నట్లు అశోక్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్​ బవాంకులే హాజరయ్యారు. అశోక్​తో పాటు కాంగ్రెస్​ మాజీ ఎమ్మెల్సీ అమర్​ రాజుర్కర్​ కూడా కాంగ్రెస్​ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు.

'రాహుల్​, సోనియా నుంచి ఫోన్​లు వచ్చాయా?'
తనతోపాటు బీజేపీలో చేరమని తాను ఏ కాంగ్రెస్‌ నాయకులను సంప్రందించలేదన్నారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ నుంచి ఏమైనా ఫోన్​ కాల్స్‌ వచ్చాయా అని విలేకరుల అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు అశోక్‌ నిరాకరించారు. కాంగ్రెస్​ను వీడటానికి గల సరైన కారణాలను చెప్పకుండా ఇది తన సొంత నిర్ణయమని చెప్పారు. అయితే హస్తం పార్టీని వీడి కమలం పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నుంచి అశోక్ చవాన్​కు రాజ్యసభ టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాగా, ఇటీవలే సీనియర్ నేతలు బాబా సిద్ధిఖ్​, మిలింద్​ దేవరా సైతం మహా కాంగ్రెస్​కు గుడ్​బై చెప్పిన కొద్దిరోజులకే అశోక్​ పార్టీని వీడారు.

అంతకుముందు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ రాహుల్‌ నర్వేకర్​​కు సోమవారం లేఖను పంపించారు అశోక్ చవాన్​. అందులో కాంగ్రెస్​ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో రానున్న లోక్​సభ ఎన్నికలకు ముందు అశోక్​ చవాన్​ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం మహా కాంగ్రెస్​కు గట్టి ఎదురుదెబ్బే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అశోక్​ చవాన్ పొలిటికల్​ కెరీర్​
నాందేడ్​ జిల్లాకు చెందిన 65 ఏళ్ల అశోక్​ చవాన్​ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్రావ్​ భావ్​రావ్​ చవాన్​ కుమారుడు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్ర కాంగ్రెస్​ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ​2008 డిసెంబర్ నుంచి 2010 నవంబర్​ వరకు పనిచేశారు. కాంగ్రెస్ తరఫున భోకర్​ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన అశోక్​, నాందేడ్​ లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా సేవలందించారు.

రోడ్డెక్కిిన రైతులు- టియర్ గ్యాస్ ప్రయోగం- ఆందోళనలు ఉద్రిక్తం

కాంగ్రెస్​కు బిగ్ షాక్​- ఆ రాష్ట్ర మాజీ సీఎం రాజీనామా- బీజేపీలో చేరే అవకాశం

Last Updated :Feb 13, 2024, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.