ETV Bharat / bharat

ఎయిర్‌ హోస్టెస్‌పై ఆస్పత్రి సిబ్బంది లైంగిక దాడి- వెంటిలేటర్‌పై ఉన్నప్పుడే!

వెంటిలేటర్‌పై ఉన్న ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి- ఆస్పత్రి సిబ్బంది చేసినట్లు ఫిర్యాదు

Air Hostess Assaulted In Gurugram
Air Hostess Assaulted In Gurugram (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 16, 2025 at 7:47 AM IST

1 Min Read
Choose ETV Bharat

Air Hostess Assaulted In Gurugram : అస్వస్థతకు గురై వెంటిలేటర్‌పై ఉన్న ఓ ఎయిర్‌ హోస్టెస్‌పై ఆసుపత్రి సిబ్బంది ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హరియాణా గురుగ్రామ్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేస్తున్న మహిళ (46) కంపెనీ తరఫున శిక్షణ కోసం గురుగ్రామ్‌ వచ్చి, ఓ హోటల్‌లో బస చేశారు. ఈనెల 5న హోటల్​లో ఉన్న ఈత కొలనులో స్విమ్మింగ్‌ చేస్తుండగా కింద పడి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. అత్యవసర చికిత్స నిమిత్సం ఐసీయూలోని వెంటిలేటర్‌పై ఉంచారు. ఆ మరుసటి రోజే తనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఏప్రిల్ 6న వెంటిలేటర్​పై ఉన్నప్పుడు తనపై ఆసుపత్రి సిబ్బంది ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపింది. ఈ విషయాన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక భర్తకు చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఎయిర్​ హోస్టెస్​ ఫిర్యాదు మేరకు ఆస్పత్రిలోని గుర్తు తెలియని సిబ్పందిగా పేర్కొంటూ ఎఫ్​ఐఆర్​ను పోలీసులు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలాన్ని కోర్టులో న్యాయమూర్తి ఎదుట నమోదు చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.