ETV Bharat / bharat

గ్రాండ్‌గా కోతి బర్త్ డే వేడుకలు- ఈ వానరం ఫ్యామిలీకి కలిసొచ్చిందట! - MONKEY BIRTHDAY CELEBRATIONS

గ్రాండ్‌గా కోతి బర్త్‌డే వేడుకలు- వానరానికి హనుమంత గౌడగా నామకరణం- రెండో కొడుకులా భావించి పెంపకం

Monkey Birthday Celebrations
Monkey Birthday Celebrations (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 30, 2025 at 9:33 PM IST

2 Min Read

Monkey Birthday Celebrations : ఏటా ఏప్రిల్ 29వ తేదీ వస్తుందంటే చాలు ప్రభుగౌడ ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అందరూ ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తారు. ఈసారి కూడా ఇంటిల్లిపాది అదే ఉత్సాహంతో కదం తొక్కారు. కోతిపిల్ల పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా జరిపించారు. మీరు చదివింది నిజమే !! పూర్తి వివరాలు చూద్దాం.

కలిసొచ్చిన లక్
ప్రభుగౌడ ఇంట్లో జరిగే కోతిపిల్ల బర్త్‌డే వేడుకల గురించి తెలియాలంటే మనం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లాలి. హవేరీ జిల్లా రాణేబెన్నూర్ తాలూకాలోని కకోల్ గ్రామంలో ప్రభుగౌడ కుటుంబం నివసిస్తోంది. నాలుగు సంవత్సరాల క్రితం ఏప్రిల్ 29వ తేదీన ప్రభుగౌడకు ఒక కోతి పిల్ల దొరికింది. దాన్ని తన ఇంటికి తీసుకెళ్లి పెంచడం ప్రారంభించాడు. హనుమంతుడిపై ఉన్న భక్తితో ఆ వానరానికి హనుమంత గౌడ అని పేరు పెట్టాడు.

ఈ కోతి పిల్లను ప్రభుగౌడ పెంచడాన్ని మొదట్లో ఆశ్చర్యంగా చూసిన కకోల్ గ్రామస్తులు క్రమంగా దానికి అలవాటు పడ్డారు. ఈ వానరం రాకతో ప్రభుగౌడ జీవితం మారిపోయింది. వ్యాపారం, వ్యవసాయం కలిసొచ్చాయి. దీంతో ఆ కోతిపిల్ల దొరికిన రోజైన ఏప్రిల్ 29వ తేదీనే, దాని పుట్టినరోజుగా సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ వేడుకల్లో ప్రభుగౌడ కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాలతో పాల్గొంటారు. సాధారణంగా ఒక మనిషి బర్త్‌డే‌ను ఎలాగైతే జరుపుతారో అదే రేంజులో ఈ వానరం (హనుమంత గౌడ) పుట్టినరోజు వేడుకలనూ నిర్వహిస్తారు.

కేక్ కట్ చేయించి సంబరాలు
ప్రభుగౌడ- మంజుల దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు. వానరం హనుమంత గౌడను వారు రెండో కొడుకులా భావించి పెంచుకుంటున్నారు. ఈసారి ఏప్రిల్ 29వ తేదీన ప్రభుగౌడ ఇంట్లో వానరం హనుమంత గౌడకు నాలుగో పుట్టిన రోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందుకోసం ఏర్పాటు చేసిన వేదికను స్ప్రింగ్స్‌తో అలంకరించారు. రెండు కిలోల కేక్‌ను తెచ్చి కోతిపిల్లతో కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు. బర్త్ డే సందర్భంగా హనుమంత గౌడకు ప్రభుగౌడ దంపతులు కొత్త బట్టలను కానుకగా ఇచ్చారు.

ఈ వేడుకలో కకోల్ గ్రామస్తులు కూడా భాగమయ్యారు. కోతిపిల్లకు గ్రామానికి చెందిన పిల్లలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చాక్లెట్‌ను బహుమతిగా ఇచ్చుకున్నారు. వానరం హనుమంత గౌడ కట్ చేసిన కేక్‌ను తిని గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. కేక్‌తో పాటు ఉత్తర కర్ణాటకలో పేరు గాంచిన మందక్కి ఖారాను పంపిణీ చేశారు. నోరు లేని వానరంపైనా ఎనలేని ప్రేమను చూపుతున్న ప్రభుగౌడ కుటుంబాన్ని కకోల్ గ్రామస్తులు మనసారా అభినందించారు.

సెల్ఫీలు దిగేందుకు జనం పోటీ
ఇక ఈ కోతిపిల్ల ఖాళీగా ఏం ఉండదు. ప్రభుగౌడ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి కాపలా కాస్తుంది. పొలానికి తీసుకెళ్తే అక్కడ పంటకు కాపలా కాస్తుంది. ఈ వానరం రోజూ స్నానం కూడా చేసి ఫ్రెష్ అవుతుంటుంది. వానరం హనుమంత గౌడ రోజూ దోసకాయలు, క్యారెట్లు, అన్నం, చపాతీ, రోటీ సహా వివిధ రకాల కూరగాయలు తింటుంది. ప్రభుగౌడ ఫ్యామిలీ పెళ్లిళ్లు, శుభకార్యాలకు తమతో పాటు ఈ కోతిపిల్లను కూడా తీసుకెళ్తుంటుంది. ఆయా వేడుకల వేళ వానరం హనుమంత గౌడతో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడుతుంటారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.