Hubballi Police Encounter : ఐదేళ్ల చిన్నారిపై అపహరించి హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఆదివారం జరిగింది. పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పుల జరపగా నిందితుడు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడిని బిహార్‌కు చెందిన రక్షిత్ క్రాంతిగా పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగిదంటే?
హుబ్బళ్లిలోని అశోకనగర పరిధికి చెందిన ఐదేళ్ల బాలికపై బిహారుకు చెందిన రక్షిత్ హత్యకు పాల్పడ్డాడు. బాలిక తండ్రి పెయింటర్, తల్లి ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆదివారం ఉదయం ఇంటి వద్దనే కుమార్తెను వదిలి తల్లిదండ్రులు పనికి వెళ్లారు. అదే సమయంలో బాలికకు చాక్లెట్ ఇస్తానని నమ్మించి, తన షెడ్డులోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం గొంతు నులిమి హత్య చేసి పర్యారయ్యాడు. ఆ తర్వాత బాలిక కోసం తల్లిదండ్రులు వెతకగా, నిర్మానష్య ప్రాంతంలో శవమై కనిపించింది. బాలిక మృతదేహంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అశోకనగర ఠాణా ముందు ధర్నాకు దిగారు. కమిషనర్ శశికుమార్ అక్కడకు చేరుకుని, బాధితులను పరామర్శించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చి, శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని కిమ్స్‌కు తరలించారు. ఇతడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
#WATCH | Hubballi-Dharwad, Karnataka: On an encounter between police and an accused in a POCSO case, Karnataka Government Chief Whip Saleem Ahmed says, " the commissioner has given me the information that the accused tried to hit the lady inspector and in self-defence, she had to… https://t.co/Has5Zc1OVT pic.twitter.com/89CLGnYueQ
— ANI (@ANI) April 13, 2025
ఘటనాస్థలికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా, బాలికకను రక్షిత్ తీసుకెళ్లడం చూసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు నాలుగు గంటలు విచారించినట్లు హుబ్బళ్లి పోలీసు కమిషనర్ ఎన్ శశికుమార్ తెలిపారు. అతడు మూడు నెలల క్రితమే హుబ్బళ్లి వచ్చాడు. రక్షిత్ గురించి తెలుసుకునేందుకు అతడి నివాసానికి తీసుకెళ్లగా, పోలీసులపై దాడి చేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దాడిలో ఒక మహిళా సిబ్బందితో పాటు కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపగా, ఛాతీకి, కాలుకి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, నిందితుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే బాలికపై లైంగిక దాడి జరిగిందా అనేది మెడికల్ రిపోర్ట్ వచ్చాకే తెలుస్తుంది' అని శశి కుమార్ పేర్కొన్నారు. అయితే దాడిలో గాయపడిన బాధితులను చికిత్స కోసం కిమ్స్‌లో చేర్పించారు.
#WATCH | Hubballi-Dharwad, Karnataka: On an encounter between police and an accused in a POCSO case, Hubballi Police Commissioner N Shashikumar says, " today morning in vijayanagara area under ashoknagar police station of hubballi-dharwad, there was an incident where 4 to… pic.twitter.com/f8tKigWWET
— ANI (@ANI) April 13, 2025