Indian Army on Operation Sindoor : పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు బలమైన సమాధానం చెప్పాలన్నదే ఆపరేషన్ సిందూర్ లక్ష్యమని సైన్యం తెలిపింది. సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాద శిబిరాలను కచ్చితమైన ఆధారాలతో గుర్తించి స్పష్టమైన ఆధారాలతో 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించామని డీజీఎంవో లెఫ్టినెంట్ జెనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మరణించారని చెప్పారు. సాయంత్రం సైన్యం ప్రెస్ మీట్ నిర్వహించగా, ఇందులో రాజీవ్‌ఘాయ్‌తో పాటు ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ప్రమోద్ పాల్గొన్నారు. పాకిస్థాన్ భూభాగంపై చేసిన దాడులను వీడియోలు, షాటిలైట్ చిత్రాలతో సహా వెల్లడించారు. పౌరులపై దాడులకు పాకిస్థాన్ తగిన ప్రతిఫలం చెల్లించిందని డీజీఎంవో తెలిపారు.
#WATCH | Delhi: DGMO Lieutenant General Rajiv Ghai says " ...in those strikes across 9 terror hubs left more than 100 terrorists killed..." pic.twitter.com/lPjM4BQSgc
— ANI (@ANI) May 11, 2025
"ఆ తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై జరిగిన ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. IC814 హైజాక్, పుల్వామా పేలుడులో పాల్గొన్న యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ వంటి హైలెవల్ టార్గెట్లు ఉన్నాయి. దాడుల తర్వాత వెంటనే పాకిస్తాన్ నియంత్రణ రేఖ వద్ద ఉల్లంఘనలకు పాల్పడింది. విచక్షణా రహిత కాల్పుల వల్ల దురదృష్టవశాత్తూ పౌరులు, గ్రామాలు, గురుద్వారా వంటి మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. విషాదకరమైన ప్రాణనష్టం జరిగింది. భారత వైమానిక దళం దాడులలో ప్రధాన పాత్ర పోషించింది. భారత నావికాదళం కచ్చితమైన మందుగుండు సామగ్రిని అందించింది. "
--రాజీవ్ ఘాయ్, డీజీఎంవో లెఫ్టినెంట్ జెనరల్
భారత్‌లోని అనేక సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్థాన్ సైన్యం విఫల యత్నాలు చేసిందని, వాటిని తిప్పికొట్టినట్లు ఘాయ్ తెలిపారు. భారత్ కాల్పుల్లో 35 నుంచి 40 మంది పాకిస్థాన్ సైనికులు చనిపోయారని వెల్లడించారు.
#WATCH | Delhi: DGMO Lieutenant General Rajiv Ghai says, " it set into motion a very diligent and microscopic scarring of the terror landscape across the borders and the identification of terror camps and training sites. the locations that emerged were numerous, but as we… pic.twitter.com/46s0Arka6g
— ANI (@ANI) May 11, 2025
"మే 9-10 రాత్రి పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి మన గగనతలంలోకి డ్రోన్లను పంపింది. ఈసారి ముఖ్యమైన సైనిక మౌలిక సదుపాయాలతో పాటు వాయుస్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి అనేక విఫలయత్నాలు చేశారు. గగనతల రక్షణ వ్యవస్థలు, వాయుసేన సంయుక్తంగా సమర్థవంతంగా వారి ప్రయత్నాలను భగ్నం చేశాయి. పాకిస్తాన్ నియంత్రణ రేఖపై ఉల్లంఘనలు మళ్లీ ప్రారంభమై తీవ్రమైన యుద్ధ కార్యకలాపాలకు దారితీశాయి. కొన్ని వైమానిక స్థావరాలు, డంప్‌లపై గగనతలం నుంచి పదేపదే దాడులు జరిగాయి. వాటన్నిటినీ అడ్డుకున్నాం. మే 7, 10 మధ్య నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఫిరంగి, చిన్న ఆయుధాల కాల్పుల్లో పాకిస్తాన్ సైన్యం సుమారు 35 నుండి 40 మంది సైనికులను కోల్పోయినట్లు తెలిసింది."
--రాజీవ్ ఘాయ్, డీజీఎంవో లెఫ్టినెంట్ జెనరల్
బహావల్‌పూర్, మురుద్కే ఉగ్రస్థావరాలపై భారత వైమానికదళం కచ్చితమైన దాడులు చేసినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. దాడులకు ముందు ఆ తర్వాత ఘటనాస్థలి దృశ్యాలను ఏకే భారతి తెరపై ప్రదర్శిస్తూ వివరించారు. పాక్ గుంపులుగా డ్రోన్ల దాడికి పాల్పడిందని, తక్షణమే భారత్ వాటిని సరిహద్దు ఆవలే భారత్ ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. డ్రోన్లతో దాడుల సమయంలో పాకిస్థాన్ పౌర విమానాలనూ ఆకాశంలోకి తీసుకువచ్చినట్లు ఏకే భారతి అన్నారు. పాకిస్థాన్ దాడులకు ప్రతి చర్యగా లాహోర్, గుజ్రన్‌వాలా, సర్‌గోదా, రహీర్‌యార్‌ఖాన్ చక్‌లాలా, సకర్, భొలారీ, జకోబాబాద్ స్థావరాలు, రాడార్ సెంటర్లను దెబ్బతీసినట్లు చెప్పారు.
#WATCH | Delhi: Air Marshal AK Bharti shows the detailed video of the effects of India's Air Operations at Pasrur Air Defence Radar, Chunian Air Defence Radar, Arifwala Air Defence Radar, Sargodha Airfield, Rahim Yar Khan Airfield, Chaklala Airfield (Nur Khan), Sukkur Airfield,… pic.twitter.com/q1v9X9ZmEi
— ANI (@ANI) May 11, 2025
"ఏ తరహా ఆయుధాలతో దాడులు చేశామనేది నేను చెప్పలేదు. అవి ఆపరేషన్‌కు సంబంధించినవి. నేను వాటి వివరాల్లోకి వెళ్లాలనుకోవట్లేదు. మనం ఎంచుకున్న పద్ధతులు, మార్గాలు ఏవైనా, అవి శత్రు లక్ష్యాలపై కావలసిన ప్రభావాలను చూపాయి. ఎంత ప్రాణనష్టం వాటిల్లింది? ఎంత మందికి గాయాలు అయ్యాయి? మా లక్ష్యం ప్రాణనష్టం కలిగించడం కాదు. ఒకవేళ ప్రాణనష్టం జరిగితే, దానిని లెక్కించడం వారి పని అని నేను అనుకుంటున్నాను.
--ఏకే భారతి, ఎయిర్ మార్షల్
పాకిస్థాన్ ఎలాంటి కవ్వింపులకు దిగినా ప్రతి చర్యలకు సంపూర్ణ అధికారాలు మిలిటరీ కమాండర్లకు వచ్చాయని వైస్ అడ్మిరల్ ఏ.ఎన్ ప్రమోద్ స్పష్టంచేశారు. చొరబాటుకు యత్నించిన పాక్ యుద్ధవిమానాలను కూల్చామనీ, వాటి సంఖ్యపై తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఇరుదేశాల డీజీఎంవోల మధ్య చర్చలు ఉంటాయన్నారు. సైన్యం, వాయుసేనలకు మద్దతుగా నిలిచిన భారత నౌకాదళ శక్తికి భయపడే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిందని ఏ.ఎన్ ప్రమోద్ వివరించారు.
#WATCH | Delhi: #OperationSindoor | Vice Admiral AN Pramod says, " in the aftermath of the cowardly attacks on innocent tourists at pahalgam in jammu and kashmir by pakistani sponsored terrorists on 22nd april, the indian navy's carrier battle group, surface forces, submarines and… pic.twitter.com/ECYUWUpjoj
— ANI (@ANI) May 11, 2025