తెలంగాణ

telangana

WTC Final 2023 : ధోనీ రికార్డును బ్రేక్ చేయనున్న కోహ్లీ-రోహిత్​!

By

Published : Jun 4, 2023, 1:53 PM IST

ICC Finals

WTC Final 2023 Teamindia vs Australia : టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్​ కోహ్లీ డబ్ల్యూటీసీ పైనల్​ 2023 ఆడి.. మాజీ సారథి ధోనీ రికార్డును బ్రేక్​ చేయనున్నారు. అదేంటంటే..

WTC Final 2023 Teamindia vs Australia : టీమ్​ఇండియా-ఆస్ట్రేలియా ఈ నెల 7 నుంచి WTC ఫైనల్లో తలపడనున్నాయి. ఓవల్​ మదానం వేదికగా ఈ తుది పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్​తో టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ.. చెరో రికార్డును తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును అధిగమించనున్నారు.

Dhoni ICC Trophies : అదేంటంటే.. టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. భారత్ తరఫున అత్యధిక ఐసీసీ ట్రోఫీ ఫైనల్స్ ఆడిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. కెరీర్​లో మొత్తం ఐదు ఐసీసీ ఫైనల్స్​ అడాడు. 2007లో తొలిసారి ఐసీసీ ఫైనల్ ఆడిన మహీ.. ఆ తర్వాత 2011 వరల్డ్​ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్​ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌ ఆడాడు. వీటిలో మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్నాడు. 2007, 2011, 2013లో గెలుపొందాడు. ఇప్పుడు.. ధోనీ పేరిట ఉన్న అత్యధిక డబ్ల్యూటీసీ ఫైనల్స్​ ఘనతను వారు అధిగమించబోతున్నారు.

Kohli ICC Trophies : ప్రస్తుత వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ఆడబోతున్న రోహిత్ శర్మ, విరాట్​ కోహ్లీ.. తమ కెరీర్‌లో 6వ ఐసీసీ ఫైనల్ ఆడబోతున్నారు. తద్వారా మహీని అధిగమించి రెండో స్థానాన్ని అందుకోబోతున్నారు. కోహ్లీ అండర్​-19 వరల్డ్​ కప్ ఫైనల్‌ కాకుండా 2011లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడాడు. ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2014లో టీ20 ప్రపంచకప్, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్​ల్లోనూ బరిలోకి దిగాడు.

Rohith ICC Trophies : రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్‌తో మొదటి సారి ఐసీసీ ఫైనల్‌ బరిలోకి దిగాడు. ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2014లో టీ20 ప్రపంచకప్, 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2021లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆడాడు.

Yuvaraj Singh ICC Trophies : ఇక టీమ్ ఇండియా తరఫున అత్యధికంగా ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్​గా​ మాజీ దిగ్గజ ప్లేయర్​ యువరాజ్ సింగ్​ అగ్ర స్థానంలో నిలిచాడు. 2000లో తొలిసారి ఐసీసీ ఫైనల్‌ ఆడిన యువరాజ్ సింగ్​.. 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2003 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 వరల్డ్ కప్​, 2011 వరల్డ్​కప్​, 2014 టీ20 వరల్డ్​కప్​, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ.. మొత్తంగా 7 ఐసీసీ ఫైనల్స్ ఆడి ఈ మార్క్​ను అందుకున్నాడు.

ఇకపోతే యూవీ, ధోనీ, కోహ్లీ, రోహిత్​ తర్వాత... సచిన్ తెందుల్కర్​, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఆర్.అశ్విన్, రవీంద్ర జడేజా.. తలో 4 ఐసీసీ టోర్నీ ఫైనల్స్ బరిలో దిగారు.

ఇదీ చూడండి :WTC Final : 10 ఏళ్లలో 8 సార్లు.. రోహిత్​ శర్మనైనా తీరుస్తాడా?

ABOUT THE AUTHOR

...view details