గ్రాండ్​గా ప్రశాంత్​ నీల్​ బర్త్​డే సెలబ్రేషన్స్​.. ప్రభాస్​ దగ్గరుండి మరీ..

author img

By

Published : Jun 4, 2023, 10:33 AM IST

Updated : Jun 4, 2023, 11:09 AM IST

Prasanth Neel Birthday Celebrations

Prashanth Neel Birthday : 'సలార్'​ సినిమా సెట్స్​లో డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​ బర్త్​డే సెలబ్రేషన్స్​ను గ్రాండ్​గా జరిపారు హీరో ప్రభాస్​. ఆ ఫొటోస్​ సోషల్​ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మీరు చూశారా?

Prashanth Neel Birthday : 'కేజీఎఫ్' సిరీస్​​ చిత్రాలతో ఇండియావైడ్​గా​ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ దర్శకుడు ప్రశాంత్​ నీల్​. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద భారీ కలెక్షన్​లను సాధించింది. దీంతో ఈ డైరక్టర్​ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. భారీ యాక్షన్​ ఎంటర్​టైనర్​ చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్​గా మారారు ఈయన. ప్రస్తుతం రెబల్​ స్టార్​ ప్రభాస్​తో కలిసి 'సలార్'​ చిత్రం చేస్తున్నారు ప్రశాంత్​ నీల్​. ఈ సినిమా షూటింగ్​ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది కూడా భారీ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్​ ఎంతో ఈగర్​గా వేయిట్​ చేస్తున్నారు.

అయితే జూన్​ 4న​ ప్రశాంత్​ నీల్.. ​ తన 43వ ఏట అడుగు పెట్టారు. ఈ సందర్భంగా సినిమా సెట్స్​లో ఆయన పుట్టినరోజు వేడుకలను డార్లింగ్​ ప్రభాస్​తో పాటు ఆయన చిత్రబృందం గ్రాండ్​గా నిర్వహించింది. కేక్​ కట్​ చేసిన తర్వాత హీరో ప్రభాస్​, ప్రశాంత్​ ఒకరికొకరు కేక్​ తినిపించుకున్నారు. అనంతరం మొత్తం మూవీ టీమ్ కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. ఈ ఫొటోల్లో 'హోంబాలే ఫిల్మ్స్' విజయ్ కిర్గందూర్ కూడా ఉన్నారు. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ 'డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్' కూడా ప్రశాంత్​కు శుభాకాంక్షలు తెలిపింది. అభిమానులు కూడా సోషల్​మీడియా వేదికగా ఆయనకు బర్త్​డే విషెస్​ చెబుతున్నారు. ఇకపోతే 'సలార్​' సినిమాకి సంబంధించిన టీజర్‌ను మూవీ టీమ్​ త్వరలోనే విడుదల చేయనున్నట్టు సమాచారం.

Prasanth Neel Birthday Celebrations
గ్రాండ్​గా ప్రశాంత్​ నీల్​ బర్త్​డే సెలబ్రేషన్స్​

Prashanth Neel Biography : 1980 జూన్​ 4న కర్ణాటక బెంగళూరులో తెలుగు కుటుంబంలో జన్మించారు ప్రశాంత్ నీల్​. ఈయన తల్లిదండ్రులు సుభాష్​, భారతి. ఆంధ్రప్రదేశ్​ మడకశిరలోని నీలకంఠపురం వీరి స్వస్థలం. కానీ బెంగళూరులో స్థిరపడ్డారు. ఈయన 2010లో లిఖితను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2014లో తన మొదటి సినిమా ఉర్గంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ప్రశాంత్​ నీల్​.

సలార్​ తర్వాతే ఆ సినిమా!
NTR 31 update : సలార్​ షూటింగ్​ పూర్తయ్యాక జూనియర్ ఎన్టీఆర్ 31వ చిత్రం NTR 31కి దర్శకత్వం వహించనున్నారు ప్రశాంత్​. ఈయన తీయబోయే 'కేజీఎఫ్​: చాప్టర్ 3'(KGF 3) సినిమాపైనా కూడా చాలా అంచనాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే 'సలార్'​ ఇంకా సెట్స్​పై ఉండగానే ప్రశాంత్​నీల్​-ప్రభాస్​ కలయికలో మరో సినిమా కూడా రూపొందుతుందని నిర్మాత దిల్​రాజు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Prasanth Neel Birthday Celebrations
గ్రాండ్​గా ప్రశాంత్​ నీల్​ బర్త్​డే సెలబ్రేషన్స్​
Last Updated :Jun 4, 2023, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.