ETV Bharat / sukhibhava

చిన్ని నయనాలను కాపాడుకుందామిలా..!

author img

By

Published : Sep 12, 2020, 10:31 AM IST

కరోనా వేళ ఆన్​లైన్ క్లాసులు వింటూ.. గంటల తరబడి స్క్రీన్లకే అతుక్కుపోతున్నారు పిల్లలు. ఇలాంటి తరుణంలో చిన్ని కళ్లను పదిలంగా చూసుకోవాలి. కానీ, ఎలా జాగ్రత్తపడాలి. మరి ఆ చిన్నారుల కంటిని కంటిపాపలా ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం రండి.

Eye checkups are important for Kids.
చిన్ని నయనాలను కాపాడుకుందామిలా..!

చిన్నారుల కళ్లను ఎలా కాపాడుకోవాలో డాక్టర్ మంజూ భాటే మన ఈటీవీ భారత్ సుఖీభవతో పంచుకున్నారు. అవేంటో చూసేయండి మరి...

ఇవి సాధారణమే...

  • పిల్లలలో వక్రీభవన లోపాలు సర్వసాధారణం. అలర్జీ కండ్లకలక, కంటిలో మంట వంటి సమస్యలతో చిన్నారులు బాధపడితే పెద్దగా భయపడనక్కర్లేదు.

పరీక్షలు ఎప్పుడు అవసరం..?

  • 3-4 ఏళ్ల పిల్లలకు తరచూ కళ్ల పరీక్షలు చేయిస్తే మంచిది. ఆ వయసులో కనుపొరలు సున్నితంగా ఉంటాయి కాబట్టి సమస్యలు ఉంటే, చికిత్సతో నయం చేయొచ్చు.
  • ఇక పిల్లలు అదేపనిగా కంటిని నలుస్తూ, కంటి సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తే.. వెంటనే కంటి వైద్యున్ని సంప్రదించాలి.
  • చిన్నారులు పుస్తకాలు, వస్తువులూ మరీ దగ్గరగా పెట్టి చూడటం, కళ్లు చిన్నగా చేసి చూడటం చేస్తే కంటి సమస్య అని అనుమానించి పరీక్షలు చేయించాలి.

ఎలా కాపాడుకోవాలి..?

  • పిల్లలు వెలుతురు బాగా ఉన్న గదిలోనే చదువుకోవాలి. మసక, చీకటి గదిలో చదవడానికి, రాయడానికి ప్రయత్నించొద్దు.
  • కౌమార దశ పూర్తయ్యేదాకా ఫోన్లు, టీవీ స్క్రీన్లకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది.
  • తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తరచూ పిల్లల చూపులో తేడాను గమనిస్తూ ఉండాలి.

ఆహారం మార్చాలా?

  • కంటి కోసం ప్రత్యేకంగా ఆహారం తీసుకోవాల్సిన పనిలేదు. భారతీయ వంటకాల్లో కంటికి అందాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
  • అయితే, చిన్నారి పోషకాహార లోపంతో ఉంటే మాత్రం తప్పకుండా వైద్యుల సలహా మేరకు ఆహార మార్పులు చేయాలి.
  • కంటి ఇన్ఫెక్షన్ ఉన్నవారికి దూరంగా ఉంటే, ఆ ఇన్ఫెక్షన్ పిల్లలకు సోకకుండా ఉంటుంది.

-డాక్టర్ మంజూ భాటే, ఎంబీబీఎస్, డీఎన్బీ(కంటి వైద్యులు)

ఎల్.వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, హైదరాబాద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.