ETV Bharat / state

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కత్తితో దాడి

author img

By

Published : Nov 15, 2019, 1:36 PM IST

Updated : Nov 15, 2019, 2:19 PM IST

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు వారిపై పగబట్టారు. ఊరికి రమ్మని పిలిచి అబ్బాయి గొంతు కోశారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కత్తితో దాడి

వనపర్తి జిల్లా అచ్యుతాపురం గ్రామానికి చెందిన కళ్యాణ్ 20 రోజుల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల హైదరాబాద్​కి మకాం మార్చారు. ఇంటికి రమ్మని ఇరుకుటుంబాల సభ్యులు ఫోన్ చేయడంతో ఊరెళ్లారు. పెద్దలు పంచాయితీ పెట్టించి మాట్లాడుతుండగా... ఇరు కుటుంబ సభ్యులకు వాగ్వాదం చెలరేగింది. కళ్యాణ్​పై అమ్మాయి పెద్ద నాన్న కొడుకు రవి కత్తితో దాడి చేశాడు. గొంతు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాధితుడిని వనపర్తి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు 17 కుట్లు వేసి అబ్జర్వేషన్​లో ఉంచారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కళ్యాణ్​పై దాడికి పాల్పడ్డ రవి పరారీలో ఉన్నాడు. బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కత్తితో దాడి

ఇవీ చూడండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!

Intro:tg_mbnr_08_15_murder_attempt_avb_ts10053
వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన కళ్యాణ్ అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన రవి అనే యువకుడు గొంతు కోసి హత్య యత్నానికి పాల్పడ్డాడు
ఈ క్రమంలో కళ్యాణ్కు గొంతు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో తీవ్ర రక్త స్రావం లో ఉన్న కళ్యాణను వనపర్తి జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స నిర్వహించిన వైద్యులు 17 కుట్లు వేసి రిజర్వేషన్లు ఉంచారు
పోలీసుల వివరాల ప్రకారం అచ్యుతాపురం గ్రామానికి చెందిన కళ్యాణ్ అదే గ్రామానికి చెందిన అమ్మాయితో ప్రేమ వివాహం చేసుకుని గత 20 రోజులుగా హైదరాబాద్లో ఉంటున్నారు.
ఈ క్రమంలో ఇరు కుటుంబ సభ్యులు ఈ రోజు గ్రామంలో పంచాయతీ ఏర్పాటు చేసి మాట్లాడుతుండగా అమ్మాయి పెదనాన్న కొడుకు అయిన రవి ఒక్కసారిగా కళ్యాణ్ పై కత్తితో దాడి చేసి హత్యప్రయత్నం చేశారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న కళ్యాణును చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వనపర్తి గ్రామీణ ఎస్సై షఫీ పేర్కొన్నారు.


Body:tg_mbnr_08_15_murder_attempt_avb_ts10053


Conclusion:tg_mbnr_08_15_murder_attempt_avb_ts10053
Last Updated : Nov 15, 2019, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.