తెలంగాణ విశ్వవిద్యాలయం.. సమస్యల వలయం

author img

By

Published : Dec 12, 2019, 5:54 PM IST

students facing problems in telangana university due to lack of infrastructure

ఇదీ తెలంగాణ విశ్వవిద్యాలయం పరిస్థితి.. ప్రాంగణం అంతా ఓ సమస్యల వలయం.. ఇక్కడ సీటు వచ్చాక ఎంతో సంతోషించిన విద్యార్థులు.. తీరా చేరాక ఎందుకొచ్చామా అనేంతగా సమస్యలు తిష్ట వేయాయి.

తెలంగాణ విశ్వవిద్యాలయం.. సమస్యల వలయం

సరిపోని తరగతి గదులు.. కానరాని శాశ్వత అధ్యాపకులు.. జరగని తరగతులు.. విద్యార్థుల అవస్థలు కచ్ఛితంగా చెప్పాలంటే ఇది తెలంగాణ విశ్వవిద్యాలయం దుస్థితి. నిజామాబాద్​ జిల్లాలో ఏర్పాటైన ఈ యూనివర్శిటి సమస్యలకు కేరాఫ్​గా నిలిచింది.

పేరు చూసి వచ్చాం..

విశ్వవిద్యాలయం ఏర్పాటై పదమూడేళ్లయ్యింది. ఇక్కడ 29 కోర్సులున్నాయి. డిచ్​పల్లిలో ప్రధాన ప్రాంగణం, భిక్కనూరులో దక్షిణ ప్రాంగణం ఉంది. ప్రారంభం నుంచి సమస్యలున్నా పరిష్కరించే నాథుడే కరవైయ్యాడు. ఎన్నో ఆశలతో విశ్వవిద్యాలయం గడప తొక్కామని.. ఇక్కడకు వచ్చిన నుంచి ఎప్పుడు వెళ్లిపోతామా అనేలా పరిస్థితులున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందరూ పొరుగు వారే..

పరీక్షల విభాగంలోనూ పాలన అటకెక్కింది. ఫలితంగా పరీక్షల నిర్వహణపై ప్రభావం పడుతోంది. గ్రంథాలయం, ల్యాబ్​లోనూ సిబ్బంది లేకపోవడం వల్ల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. స్వీపర్ నుంచి సీనియర్ అసిస్టెంట్ వరకు అందరూ పొరుగు సేవల కిందనే విధులు నిర్వర్తిస్తున్నారు.

కొత్త వీసీ రాక ఎప్పుడో..

ఇటీవలే ఇంఛార్జీ వీసీ పదవీ విరమణ చేశారు. దీంతో సమస్య మరింత జఠిలమైంది. నూతన వీసీ వస్తే తప్ప సమస్య పరిష్కారం అయ్యేలా లేదు. ఇప్పట్లో కొత్త వైస్​ ఛాన్సలర్​ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఉన్న అధికారులు సైతం సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. పాలన నుంచి విద్యార్థుల చదువుల వరకు అన్ని అస్తవ్యస్థంగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇవీచూడండి: గొల్లపూడి నాటకాలు.. భాషాభివృద్ధికి మార్గదర్శకం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.