ETV Bharat / state

'వాడివేడిగా ఐటీడీఏ సమావేశం... సమస్యలు మేం పరిష్కరిస్తాం'

author img

By

Published : Dec 20, 2019, 10:56 PM IST

Updated : Dec 21, 2019, 12:07 AM IST

ములుగు జిల్లాలోని ఐటీడీఏ కార్యాలయంలో పాలక మండలి సమావేశం జరిగింది. ఏజెన్సీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.

మీ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా : మంత్రి సత్యవతి
మీ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా : మంత్రి సత్యవతి

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో పాలక మండలి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గిరిజన శిశువు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న రోడ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలపై వాడివేడిగా చర్చ నిర్వహించారు.

ములుగు ఏజెన్సీలో ఉన్న గ్రామాలకు రోడ్డు నిర్మాణం, విద్యుత్ పనులు చేపట్టినప్పటికీ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల గిరిజన గ్రామీణ ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తారు. మేడారం జాతరకు ఎన్నోమార్లు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించినప్పటికీ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపాలున్నాయని ఆమె అన్నారు.

సీఎం కేసీఆర్​తో చర్చిస్తా : సత్యవతి రాథోడ్

ఎమ్మెల్యేలు, జడ్పీటీసీల సమస్యలు విన్న మంత్రి సత్యవతి రాథోడ్... ఏజెన్సీ గ్రామాల్లో రైతులపై దాడులు చేస్తున్న అటవీశాఖ అధికారులపై సీఎం కేసీఆర్​తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఏజెన్సీలో రోడ్డు నిర్మాణాలు, వాగులపై బ్రిడ్జిలు అటవీ అధికారులతో మాట్లాడి ఎలాంటి నిబంధనలు లేకుండా పూర్తయ్యేలా చూస్తామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు.

సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మహబూబాబాద్ శంకర్ నాయక్, భూపాలపల్లి గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ములుగు జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ జగదీశ్వర్, జడ్పీపీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు.

మీ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా : మంత్రి సత్యవతి

ఇవీ చూడండి : సమత కేసులో డిశ్చార్జ్‌ పిటిషన్ కొట్టివేత

Intro:tg_wgl_52_20_itda_paalakamandli_samawesham_ab_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం లో పాలకమండలి సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన శిశువు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మహబూబాబాద్ శంకర్ నాయక్, భూపాలపల్లి గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ములుగు జిల్లా జెడ్పి చైర్ పర్సన్ జగదీశ్వర్, జెడ్ పి టి సి, ఎం పి పి లు హాజరయ్యారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న రోడ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థల పై వాడివేడిగా చర్చ నిర్వహించారు. ములుగు ఏజెన్సీలో ఉన్న గ్రామాలకు రోడ్డు నిర్మాణ పనులు విద్యుత్తు పనులు లు పనులు అవుతానని నిర్మాణ పనులు చేపట్టి పూర్తి కాకపోవడం వల్ల గిరిజన గ్రామీణ ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తారు. మేడారం జాతర లో పనులు ఎన్నోమార్లు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపాలు కండ్లకు కట్టినట్టు బాగుపడుతుందని గత సంవత్సరం చేసిన తారు రోడ్డు సిసి రోడ్లు మేడారం జాతర పూర్తి కాగానే శిథిలావస్థకు చేరుకున్నాయని ఆమె అన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం అటవీ భూమిని పొడి చేసుకుని గిరిజన రైతులు సాగు చేసుకుంటూ ఉంటే అటవీశాఖ అధికారులు మాత్రం అటవీశాఖ అధికారులు మాత్రం నిరుపేదలైన గిరిజనుల భూములు లాక్కొని మొక్కలు పెడుతున్నారని ఆమె అన్నారు. ఫొటోస్ పోడు భూములు సాగు చేసుకుని ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటే అటవీ భూముల్లో విద్యుత్తు స్తంభాలు ఉన్నాయని, ఆ భూములలో బోర్లు వేయకుండా అడ్డుకుని ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని అన్నారు. నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లి గ్రామం గురుకుల విద్యాలయం లో సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను చూస్తే కచ్చితంగా ఆ కళాశాలలో సీసీ కెమెరాలు, మరుగుదొడ్లు నిర్మించాలని సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. గిరిజన తండాల్లో గూడలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని విద్య వైద్యం విద్యుత్తు సదుపాయాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, జడ్పీటీసీల వారి వారి సమస్యలు విన్న మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాల్లో రైతులపై దాడులు చేస్తున్న అటవీశాఖ అధికారుల వ్యవహారంపై వారికి జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యమంత్రి తో చర్చించి ఏజెన్సీ మండలంలోని, గ్రామాల్లో గాని గిరిజనుల బాధలు ముఖ్యమంత్రితో మాట్లాడే విధంగా కృషి చేస్తానని మంత్రి అన్నారు. ఏజెన్సీలో రోడ్డు నిర్మాణాలు వాగుల పై బ్రిడ్జిలు ఫారెస్ట్ అధికారులతో ఇలాంటి ఇ నిబంధనలు లేకుండా పూర్తయ్యేలా చూస్తామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు.


Body:ss


Conclusion:బైట్స్: 1 సీతక్క ములుగు ఎమ్మెల్యే
2, సత్యవతి రాథోడ్ గిరిజన,శిశు, మహిళ సంక్షేమ శాఖ మంత్రి
3, సి నారాయణరెడ్డి ములుగు జిల్లా కలెక్టర్
Last Updated : Dec 21, 2019, 12:07 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.