ETV Bharat / state

బావా అక్కతో కలిసుండాలి.. అన్నందుకు బావమరిదిని చంపేశాడు

author img

By

Published : Nov 14, 2019, 7:42 PM IST

ఆదిలాబాద్​లో నడిరోడ్డుపై హత్య జరిగింది. సొంత బావమరిదిని కత్తితో పొడిచి బావ హతమార్చాడు. భార్యభర్తలు కలిసిమెలిసి ఉండాలని కోరినందుకు పగ పెంచుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

బావా అక్క కలిసుండాలి.. అన్నందుకు బావమరిదిని చంపేశాడు

ఆదిలాబాద్​ కుర్షిద్​నగర్​లో దారుణం చోటుచేసుకుంది. సొంత బావమరిదిని కత్తితో పొడిచి బావ హతమార్చాడు. 14 ఏళ్ల క్రితం పట్టణానికి చెందిన ఒసావర్​ సంతోష్​కు, మహాహాష్ట్రలోని దహెల్లితండాకు చెందిన మమతకు వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. విసుగుచెందిన మమత పుట్టింటికి వెళ్లింది. మమత సోదరుడు మనోజ్​ ఇటీవల పెద్దమనుషుల వద్ద పంచాయతీ పెట్టించి... వివాదం సద్దుమణిగేలా చేశాడు.

కలిసి మెలిసి ఉండాలన్న మనోజ్​పై... సంతోష్​ పగ పెంచుకొని అదను కోసం ఎదురుచూస్తున్నాడు. ఇవాళ ఉదయం సోదరిని చూసేందుకు మనోజ్​ ఆదిలాబాద్​కు వచ్చాడు. పిల్లలకు కొత్త బట్టలు కూడా కొనిచ్చినట్లు తెలుస్తోంది. పగతో రగిలిపోతున్న మనోజ్​... టీ తాగేందుకని బయటకు తీసుకెళ్లాడు. ఇదే అదనుగా కత్తితో అతి కిరాతకంగా పొడిచి హతమార్చాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బావా అక్క కలిసుండాలి.. అన్నందుకు బావమరిదిని చంపేశాడు

ఇవీ చూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా

Intro:TG_ADB_04_14_MURDER_TS10029Body:4Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.