ETV Bharat / state

నాగోబా జాతర: గంగాజలం కోసం కొండలు ఎక్కుతూ..

author img

By

Published : Jan 12, 2020, 11:57 AM IST

ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన కేస్లాపూర్‌ నాగోబా జాతరకు సమయం సమీపిస్తోంది. అందుకు కీలకమైన గంగాజలం కోసం మెస్రం వంశీయులు బయలు దేరారు. ఉట్నూర్ మండలం తారలో వారికి ఘనస్వాగతం లభించింది.

adivasilu
పవిత్ర గంగాజలం కోసం అడవిలో ఆదివాసీల ప్రయాణం

పవిత్ర గంగాజలం కోసం అడవిలో ఆదివాసీల ప్రయాణం

ఆదివాసీ గిరిజనుల అతిపెద్ద వేడుకకు సర్వం సిద్ధమైంది. వారి ఆరాధ్యదైవం నాగోబాను గంగా జలాలతో అభిషేకించడం ఆనవాయితీ. ఏటా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరి నదిలో గల హస్తినమడుగు నుంచి జలాలను ప్రత్యేక కలశంలో సేకరించి తీసుకొస్తారు మెస్రం వంశీయులు. దీనికోసం ఈనెల ఏడో తేదీన కాలినడకన బయలుదేరారు.

తారలో ఘన స్వాగతం...

ఉట్నూర్ మండలం తారకు చేరుకున్న మస్రం వంశీయులకు ఎంపీపీ జయవంత్ రావు, ఆదివాసీ నేత బాజీరావు నేతృత్వంలో స్థానికులు ఘన స్వాగతం పలికారు. తాండాలో పూజలు నిర్వహించుకొని ఏలూరు మీదుగా తేజాపూర్ బయలు దేరారు. కొండలు ఎక్కుతూ.. గుట్టలు ఎక్కుతూ... వారి యాత్ర సాగుతోంది. ఈ నెల 14న వారు హస్తిన వాగుకు చేరుకుంటారు. అక్కడి పవిత్ర గంగాజలంతో తిరుగు ప్రయాణమవుతారు.

ఇవీ చూడండి: నేటితో 'పల్లె ప్రగతి 2.o' ముగింపు

Intro:కొండలు గుట్టలు దాటుతూ గంగాజలం కోసం
ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా పూజల కు అవసరమయ్యే పవిత్ర గంగాజలం కోసం మెస్రం వంశీయులు ఈ నెల 7న కాలినడకన బయలుదేరారు . శుక్రవారం రాత్రి ఉట్నూర్ మండలం తారకు చేరుకోవడంతో వారికి స్థానికులు ఎంపీపీ జయవంత్ రావు ఆదివాసి నాయకుడు బాజీరావు ఘనంగా స్వాగతం పలికారు. శనివారం ఉదయం తాండాలో పూజలు నిర్వహించుకొని ఏలూరు మీదుగా తేజాపూర్ కు బయలు దేరారు. ఇచ్చారు ప్రయాణం అయ్యారు. వారు భక్తిశ్రద్ధలతో కొండకోనలు దాటుకుంటూ బయలుదేరుతున్నారు. ఈ నెల 14న జన్నారం మండలం కలమడుగు లోని హస్తిన వాగులో ప్రత్యేక పూజలు నిర్వహించుకొని పవిత్రమైన గంగాజలంతో తిరుగుముఖం పడతామని పేర్కొన్నారు.
మెశ్రమ కోసు రావు పటేల్


Body:రాజేందర్ కంట్రిబ్యూటర్


Conclusion:9441086640

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.