ETV Bharat / sports

భారత్-విండీస్​ చివరి టీ20లో నమోదైన రికార్డులివే

author img

By

Published : Dec 12, 2019, 11:24 AM IST

బుధవారం విండీస్​తో జరిగిన చివరి టీ20లో భారత్.. 67 పరుగుల తేడాతో విజయం సాధించడమే కాకుండా కొన్ని అరుదైన రికార్డులు నెలకొల్పింది. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం!

Team India, Virat, Rahul, Rohit Break Records in Series Win
విండీస్​తో చివరి టీ20లో నమోదైన రికార్డులివే..!

వెస్టిండీస్​తో జరిగిన నిర్ణయాత్మక టీ20లో 67 పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా. కెప్టెన్ విరాట్ కోహ్లీ(71), కేఎల్ రాహుల్(91), రోహిత్ శర్మ(70) అర్ధశతకాలతో చెలరేగి, సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. దీనితో పాటే ఈ మ్యాచ్​లో అరుదైన రికార్డులు నమోదయ్యాయి.

మూడో టీ20లో కొన్ని రికార్డులు..

  • విండీస్​తో ఇప్పటివరకు టీమిండీయా 17 టీ20లు ఆడగా.. అందులో 10 మ్యాచ్​ల్లో విజయం సాధించింది. ఆరింట్లో ఓడిపోగా.. ఓ మ్యాచ్​ డ్రాగా ముగిసింది. కోహ్లీసేన కరీబియన్లపై 62.50 శాతం విజయాలను నమోదు చేసింది.
  • కరీబియన్లపై ఎక్కువ పరుగుల అంతరంతో భారత్​ గెలిచిన మ్యాచ్​ల్లో ఇది రెండోది. అంతకుముందు 2018 నవంబరు 6న జరిగిన మ్యాచ్​లో 71 పరుగుల తేడాతో గెలిచింది కోహ్లీసేన.
    Team India, Virat, Rahul, Rohit Break Records in Series Win
    టీమిండియా
  • టీ20ల్లో ముగ్గురు టీమిండియా బ్యాట్స్​మన్​ 70కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి.
  • విండీస్​పై మొదటిసారి, వరుసగా మూడు ద్వైపాక్షిక టీ20 సిరీస్​లు సొంతం చేసుకున్న జట్టుగా భారత్​ ఘనత సాధించింది. 2018-19లో 3-0 తేడాతో, 2019 ఆగస్టులో 3-0 తేడాతో, ఇప్పుడు 2-1 తేడాతో సిరీస్​లను కైవసం చేసుకుంది టీమిండియా.
  • టీ20ల్లో వెస్టిండీస్​పై రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది భారత్​. బుధవారం జరిగిన మ్యాచ్​లో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. అంతకుముందు 2016 ఆగస్టులో 244 పరుగులు చేసింది.
  • కరీబియన్లపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం(135) నమోదైంది. రోహిత్ శర్మ(71)- రాహుల్(91) జోడీ.. బుధవారం జరిగిన మ్యాచ్​లో ఈ ఘనత సాధించింది. అంతకుముందు 2018లో ధావన్-రోహిత్ 123 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు.
    Team India, Virat, Rahul, Rohit Break Records in Series Win
    విరాట్ కోహ్లీ
  • టీ20ల్లో రోహిత్ - రాహుల్.. 50 పరుగులకు మించి భాగస్వామ్యం నమోదు చేయడం ఇది ఐదోసారి.
  • పొట్టి ఫార్మాట్లో విండీస్​పై పవర్​ప్లేలో అత్యధిక పరుగులు(72) చేశారు భారత బ్యాట్స్​మెన్.
  • టీ20ల్లో విండీస్​పై 62.06 శాతం విజయాలతో విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు. కోహ్లీ సారథ్యం వహించిన 30 టీ20ల్లో 18 గెలవగా.. 11 మ్యాచ్​ల్లో ఓడింది టీమిండియా. ఒక మ్యాచ్​లో ఫలితం తేలలేదు.
  • పొట్టి ఫార్మాట్లో అత్యధికంగా 50కి పైగా పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా విరాట్​కోహ్లీ(24) రికార్డు సృష్టించాడు. అతడి తర్వాత రోహిత్ శర్మ(23, 19 అర్ధశతకాలు, 4 సెంచరీలు) ఉన్నాడు.
  • టీ20ల్లో అత్యధిక సగటుతో బ్యాటింగ్ చేసిన బ్యాట్స్​మన్​గా విరాటో కోహ్లీ(75 మ్యాచ్​ల్లో 52.06 సగటు), రోహిత్​ శర్మ(104 మ్యాచ్​ల్లో 32.10 సగటు) రికార్డు సృష్టించారు.
  • టీ20ల్లో ఓ సిరీస్​లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన భారత బ్యాట్స్​మన్​గా కోహ్లీ(13) ఘనత సాధించాడు.
  • కెప్టెన్​గా కోహ్లీ.. టీ20ల్లో 976 పరుగులు చేశాడు. 29 ఇన్నింగ్స్​ల్లో 46.47 సగటుతో బ్యాటింగ్ చేశాడు. ఇందులో 8 అర్ధశతకాలు ఉన్నాయి.
  • పొట్టి ఫార్మాట్​లో 5 సార్లు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అందుకున్నాడు విరాట్. ఇప్పటికి ఇదే రికార్డు.
  • విండీస్ కెప్టెన్ పొలార్డ్..​ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 68 పరుగులతో నాలుగో టీ20 అర్ధశతకాన్ని సాధించాడు. భారత్​పై అతడికిది రెండోది. కెప్టెన్​గా ఇది అతడికి మొదటిది.

టీ20ల్లో ఇరుజట్ల సారథలు 50కిపైగా పరుగులు చేయడం ఇది పదోసారి. ఈ మ్యాచ్​లో రెండు జట్లు కలిపి 28 సిక్సర్లు కొట్టారు. భారత్​లో ఇది రెండో అత్యుత్తమం.

RESTRICTION SUMMARY: TV TOKYO - NO ACCESS JAPAN; CLEARED FOR DIGITAL AND ONLINE USE, EXCEPT BY JAPANESE MEDIA; NBC, CNBC, BBC, AND CNN MUST CREDIT 'TV TOKYO' IF IMAGES ARE TO BE SHOWN ON CABLE OR SATELLITE IN JAPAN; NO CLIENT ARCHIVING OR REUSE; NO AP REUSE
SHOTLIST:
TV TOKYO - NO ACCESS JAPAN; CLEARED FOR DIGITAL AND ONLINE USE, EXCEPT BY JAPANESE MEDIA; NBC, CNBC, BBC, AND CNN MUST CREDIT 'TV TOKYO' IF IMAGES ARE TO BE SHOWN ON CABLE OR SATELLITE IN JAPAN; NO CLIENT ARCHIVING OR REUSE; NO AP REUSE
Tokyo – 11 December 2019
1. Japanese Prime Minister Shinzo Abe walking to the stage
2. SOUNDBITE (Japanese) Shinzo Abe, Japanese Prime Minister:
"The stock price rose 1000 yen (in the past year), but (in the previous year) your forecast was an average of 300 yen minus. This is a deflationary mindset. We need to get over this. I think this is an important point. Regardless of the current budget or the supplementary budget, the Japanese economy must grow steadily in the fourth industrial revolution that is becoming more digital."
++BLACK FRAMES++
3. Abe leaving
4. Wide of Bank of Japan Governor Haruhiko Kuroda on stage
5. SOUNDBITE (Japanese) Haruhiko Kuroda, Bank of Japan Governor:
"I am concerned about the fact that there are only few bankers here with happy faces. However, the global economy itself is showing positive signs. Major countries such as the United States and China are solid. Although India is not doing well, the IMF expects that it will return to its original growth next year. Overall, I think it will be relatively bright next year."
++BLACK FRAMES++
6. SOUNDBITE (Japanese) Haruhiko Kuroda, Bank of Japan Governor:
"We must keep an eye on climate change. The BOJ (Bank of Japan) would like to provide support in a variety of ways on climate change."
++BLACK FRAMES++
7. Kuroda raising a toast and leaving the stage
STORYLINE:
Japanese Prime Minister Shinzo Abe urged economists in Japan to get out of the "deflation mindset" during a year-end social gathering Wednesday in Tokyo.
Abe pointed out that last year stock prices rose 1000 yen and did better than economists had forecast.
Bank of Japan governor Haruhiko Kuroda shared a positive economic outlook for next year as he toasted the crowd with a drink.
"I think it will be relatively bright next year," Kuroda said.
Kuroda also said the bank would do what it could to support climate change initiatives.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.