ETV Bharat / sitara

హీరో నవీన్​ తల్లిదండ్రులు భావోద్వేగం.. వీడియో వైరల్​

author img

By

Published : Mar 14, 2021, 2:15 PM IST

హీరోగా నటించిన రెండో చిత్రంతోనే బ్లాక్​బస్టర్​ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు కథానాయుకుడు నవీన్​ పొలిశెట్టి. ఆయన ప్రధానపాత్రలో నటించిన 'జాతిరత్నాలు' చిత్రం మార్చి 11న విడుదలై విశేషాదరణ దక్కించుకుంది. ఈ ఆనందంతో నవీన్​ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

Hero Naveen Polishetty parents got emotional
హీరో నవీన్​ తల్లిదండ్రులు భావోద్వేగం.. వీడియో వైరల్​

కథానాయకుడిగా రెండో చిత్రంతోనే బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నవీన్‌ పొలిశెట్టి. నటన మీద ఉన్న ఆసక్తితో 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌', '1 నేనొక్కడినే' చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన ఆయన 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవీన్‌కు మంచి విజయాన్ని అందించింది. ఈ క్రమంలోనే ఆయన కథానాయకుడిగా నటించిన రెండో సినిమా 'జాతిరత్నాలు' ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద నవ్వుల వర్షంతో పాటు కాసుల పంట పండిస్తోంది.

'జాతిరత్నాలు' సినిమాతో తమ కుమారుడికి లభించిన ప్రేక్షకాదరణ చూసి నవీన్‌ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. నవీన్‌ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న తల్లిదండ్రులిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. 'దీనినే పుత్రోత్సాహం అంటారు. నవీన్‌ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ 'జాతిరత్నాలు'. అనుదీప్‌ దర్శకుడు. వైజయంతి మూవీస్‌, స్వప్నా సినిమాస్‌ బ్యానర్లపై నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఇందులో ఓ సన్నివేశంలో కీర్తిసురేశ్‌, క్లైమాక్స్‌లో విజయ్‌ దేవరకొండ అతిథిపాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు.

ఇదీ చూడండి: అసలు ఎవరీ 'సారంగ దరియా'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.