ETV Bharat / jagte-raho

యువతి ప్రేమ పెళ్లి.. పరువు కోసం ఆమె భర్త హత్య

author img

By

Published : Sep 25, 2020, 8:56 AM IST

Updated : Sep 25, 2020, 2:25 PM IST

యువతి ప్రేమ పెళ్లి.. పరువు కోసం ఆమె భర్త హత్య
యువతి ప్రేమ పెళ్లి.. పరువు కోసం ఆమె భర్త హత్య

14:12 September 25

యువతి ప్రేమ పెళ్లి.. పరువు కోసం ఆమె భర్త హత్య

యువతి ప్రేమ పెళ్లి.. పరువు కోసం ఆమె భర్త హత్య

08:46 September 25

యువతి ప్రేమ పెళ్లి.. పరువు కోసం ఆమె భర్త హత్య

కుమార్తె ప్రేమ పెళ్లి.. పరువు కోసం అల్లుడి హత్య

రాష్ట్రంలో పరువు హత్యలు ఆగడం లేదు. హైదరాబాద్ చందానగర్​కు చెందిన హేమంత్‌(26) అదే ప్రాంతానికి చెందిన అవంతి(23) గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు 2020 జూన్​ 11న కుత్బుల్లాపూర్ సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయంలో రిజిస్ట్రార్​ పెళ్లి చేసుకున్నారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఈ విషయమై చందానగర్​ పోలీస్​ స్టేషన్​లో మిస్సింగ్​ కేసు పెట్టారు. ​ఇరుకుటుంబాలను పోలీస్​ స్టేషన్​కు పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్​ ఇచ్చారు. అవంతి తన భర్తతో ఉంటానని చెప్పారు. అప్పటి నుంచి వీరిద్దరు గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉంటున్నారు. రోజు అవంతి వారి తల్లిదండ్రులు, బంధువులతో ఫోన్లో మాట్లాడుతున్నారు.  

బలవంతంగా లాక్కెళ్లారు

ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అవంతి వారి తల్లిదండ్రులు, బంధువులు మూడు కార్లలో వచ్చి అవంతి, హేమంత్​ను బలవంతంగా లాక్కెళ్లారు. గోపాన్​పల్లి పోయేసరికి అవంతి, హేమంత్​ తప్పించుకున్నారు. అమ్మాయి మేనమామ యుగంధర్ రెడ్డి హేమంత్​ను పట్టుకుని కారులో ఔటర్​ రింగ్​ వైపు తీసుకెళ్లారు.  సమాచారమందుకున్న పోలీసులు సాయంత్రం 5 గంటల వరకు తొమ్మిది మంది నిందితులను పట్టుకున్నారు. యుగంధర్ రెడ్డి ఫోన్​ స్విచ్​ చేయడం వల్ల అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో యుగంధర్​ రెడ్డి షామీర్​పేట వద్ద అదుపులోకి తీసుకున్నారు.  

ఉరేసి హత్య

అతన్ని విచారించగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కిష్టయ్యగూడెం గ్రామ శివారులో హేమంత్​ గొంతుకు ఉరేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హేమంత్​ మృతదేహాన్ని తెల్లవారుజామున ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. కూతురు ప్రేమ వివాహం ఇష్టం లేని లక్ష్మారెడ్డే హత్య చేయించారని హేమంత్ తల్లిదండ్రులు ఆరోపించారు.  

 ఇదీ చదవండి: మా అబ్బాయిని పొట్టనపెట్టుకున్నారు: హేమంత్ తల్లి

Last Updated : Sep 25, 2020, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.