ETV Bharat / entertainment

అన్​లిమిటెడ్ ఎంటర్​టైన్​మెంట్​ లోడింగ్​.. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' ట్రైలర్ వచ్చేసిందోచ్..

author img

By

Published : Aug 21, 2023, 7:25 PM IST

Updated : Aug 21, 2023, 8:08 PM IST

Miss Shetty Mr Polishetty Trailer : యువనటుడు నవీన్ పొలిశెట్టి అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'.. సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. మంచి కామెడీ టైమింగ్​తో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Miss Shetty Mr Polishetty Trailer
Miss Shetty Mr Polishetty Trailer

Miss Shetty Mr Polishetty Trailer : జాతి రత్నాలు ఫేమ్​ హీరో నవీన్ పొలిశెట్టి - స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కీలక పాత్రల్లో నటించిన సినిమా 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'. ఈ సినిమా ట్రైలర్​ను మూవీమేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. డీసెంట్ కామెడీతో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 'రారా కృష్ణయ్య' ఫేమ్ దర్శకుడు.. మహేశ్ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమా ఫీల్​గుడ్ లవ్​స్టోరీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా ఉండనున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్​ బ్యానర్​పై వంశీకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. కాగా సెప్టెంబర్ 7న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్​గా విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో హీరో స్టాండప్ కమెడియన్​గా, హీరోయిన్ ఫేమస్ చెఫ్ పాత్రలో కనిపించనున్నారు. 'తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్లి ఎందుకు', 'అమ్మాయిలకు ​అబ్బయిలంటే పెద్ద లిస్ట్ ఉంటుంది .. కానీ అబ్బాయిలకు ఇంత లిస్ట్ ఉండదు అమ్మాయి అయితే చాలు బ్రో', 'సీసీ కెమెరా ఉంది, వైరల్ అయిపోతాం' అనే డైలాగులు ట్రైలర్​కు హైలైట్​గా నిలిచాయి.

స్వతహాగా బతకాలనుకునే స్వభావం ఉన్న హీరోయిన్.. తల్లి అయ్యేందుకు పురుషుడి సహాయం కావాలనుకుంటుంది. కాగా కరెక్ట్ పర్సన్​ను వెతికే క్రమంలో ఆమె.. హీరోను అప్రోచ్ అవుతుంది. ఇక వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది. వారి కెమిస్ట్రీ ఎలా ఉండనుందనేది తెరపై చూడాల్సిందే.

అయితే ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. మొదట ఈ సినిమాను ఆగస్టు 4న, తర్వాత ఆగస్టు 18న రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఇక దాదాపు 5 సంవత్సరాల తర్వాత స్వీటీ (అనుష్క)ను తెరపై చూడబోతున్నామని ఆమె ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అనుష్క మెయిన్​ రోల్​లో చివరి సారిగా 2018లో 'భాగమతి' సినిమా చేశారు.

'జాతి రత్నాలు' సినిమాతో కరోనా టైమ్​లో కూడా ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించారు నవీన్ పొలిశెట్టి. ఆ తర్వాత లీడ్​ రోల్​లో వస్తున్న చిత్రం ఇదే. ఇక నవీన్ కామెడీ టైమింగ్​ గురించి ఇప్పటికే ఒక అవగాహన ఉన్న తెలుగు ఆడియెన్స్.. థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. కాగా నవీన్ 'అనగనగా ఒక రాజు' సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో గ్లింప్స్​ను కూడా వదిలారు. అప్పట్లో ఈ గ్లింప్స్ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంది.

ఫన్నీ ఫన్నీగా మిస్‌ శెట్టి- మిస్టర్‌ పొలిశెట్టి టీజర్‌.. మీరు చూశారా?

అనుష్క-చరణ్-రవితేజ.. ఈ స్టార్స్​ కొత్త మూవీస్​​ అప్డేట్స్ తెలుసా?​

Last Updated : Aug 21, 2023, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.