ETV Bharat / city

చీరలో మహిళల పరుగు... వెనకే పంచెల్లో పురుషులు!

author img

By

Published : Jan 12, 2020, 4:41 PM IST

నెక్లెస్​ రోడ్​లో ఈ ఉదయం మహిళలు పెద్దసంఖ్యలో శారీరన్​లో పాల్గొన్నారు. మహిళా ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. చీరల్లో పరుగు కార్యక్రమంలో పాల్గొన్న వారికి పురుషులు పంచెల్లో వచ్చి మద్దతు పలికారు.

చీరలో మహిళల పరుగు... వెనకే పంచెల్లో పురుషులు!
చీరలో మహిళల పరుగు... వెనకే పంచెల్లో పురుషులు!

చీరలో మహిళల పరుగు... వెనకే పంచెల్లో పురుషులు!

హైదరాబాద్​లో ఆదివారమైందంటే ఎక్కడో ఓ చోట.. ఏదో ఒక పరుగు కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అది ఆరోగ్యం కోసం కావొచ్చు... లేదంటే సామాజికం కోసం కావొచ్చు. కానీ ఈ రోజు నెక్లెస్ రోడ్​ వేదికగా ఓ వినూత్న పరుగు జరిగింది. మహిళల ఫిట్​నెస్​కు సంబంధించి 'శారీరన్'​ నిర్వహించారు. పెద్దసంఖ్యలో మహిళలు.. వారికి మద్దతు పలుకుతూ పురుషులు పరుగులో పాల్గొన్నారు.

తనైరా, పింకథాన్ ఆధ్వర్యంలో మూడో ఎడిషన్ శారీ రన్​ను మొదటిసారిగా హైదరాబాద్​లో నిర్వహించారు. నెక్లెస్ రోడ్ నుంచి జలవిహార్ వరకు నిర్వహించిన పరుగు పోటీలో దాదాపు 300 మంది మహిళలు చీరలతో వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల ఫిట్​నెస్​, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని ప్రముఖ బాలీవుడ్​ నటుడు, మోడల్ మిలింద్ సోమన్​ ప్రారంభించారు. ఈ శారీ రన్​కు మద్దతుగా ఆయన పంచె ధరించి పరుగులో పాల్గొన్నారు.

"మహిళలు ఫిట్​గా ఉండేందుకు ప్రోత్సహించడమే ఈ రన్​ లక్ష్యం. అదే సమయంలో తమకు సౌకర్యవంతమైన రీతిలోనే ఫిట్​నెస్​ను పొందవచ్చు. ప్రతి భారతీయ మహిళకు చీరతో విడదీయరాని అనుబంధం ఉంది. మహిళా సాధికారతతో ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన దేశం...ప్రపంచం తయారవుతుంది."

-మిలింద్ సోమన్, నటుడు

'డోంట్​ హోల్డ్​ బ్యాక్​' అన్న నినాదంతో ఈ శారీరన్​ను ప్రారంభించారు నిర్వాహకులు. మహిళలకు చీరకట్టు వల్ల ఎలాంటి అసౌకర్యం ఉండదని.. పరుగు పోటీల్లో కూడా పాల్గొనవచ్చని నిరూపించారు. రొమ్ము క్యాన్సర్​పై అవగాహన కల్పించారు.

TG_Hyd_23_12_Pinkathon Saree Run_Pkg_TS10005 Note: ఇది ఈటీవీకి మాత్రం ప్రత్యేకం... విజువల్స్ బాగా ఉన్నాయి గమనించగలరు. Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) నిత్యం వివిధ రకాల పరుగులు, నడకలు జరిగే హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో వినూత్నంగా మహిళలు పరుగు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో శారీ కట్టుకొని వచ్చిన మహిళలు నృత్యాలు చేస్తూ... సెల్ఫీ లకు ఫోజులు ఇస్తూ... శారీలతో పెరుగులో పాల్గొని సందడి చేశారు. Look... V.O1: తనైరా మరియు పింకథాన్ లు మూడవ ఎడిషన్ శారీ రన్ ను మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ వద్ద నిర్వహించారు. బెంగుళూరులో 2018, 19 సంవత్సరాలలో విజయవంతం గా శారీరన్ ల తర్వాత హైదరాబాద్ లో నిర్వహించిన ఈ రన్ లో మూడు వందల మంది పైగా చీర ధరించిన మహిళలు పాల్గొనడంతో పాటుగా ఫీట్ నెస్ గురించి మద్దతు పలికారు. జలవిహార్ నుంచి సంజీవయ్య పార్క్ నుంచి తిరిగి జలవిహార్ వరకు కొనసాగిన పరుగును ప్రముఖ మాడల్, నటుడు ఈ రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్ని వయసుల మహిళలు పాల్గొని... తమ అత్యుత్తమ ఫి ట్ నెస్ చూపారు. డోంట్ హోల్డ్ బ్యాక్ అనే నేపథ్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం సౌకర్యవంతంగా చీర కట్టుకోవడంతో పాటుగా పరుగులో ఎలాంటి భయం లేకుండా పరుగు యొక్క ముఖ్యఉద్దేశం. అలాగే మహిళలు ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించడ్డాన్ని ప్రోత్సాహించడంతో పాటుగా రొమ్ము క్యాన్సర్ పట్ల వారికి అవగాహన కల్పించడం... తమ జీవితాలను ప్రమాదంలో పెట్టే ఇతర ఆరోగ్య సమస్యల పట్ల మెరుగైన అవగాహన కల్పించడానికి ఈ చీర పరుగు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. Spot.... V.O 2: మహిళలు ఫిట్ నెస్ ఉండటాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా శారీ రన్ నిర్వహిస్థున్నట్లు అల్ట్రా మెన్ మిలింద్ సోమన్ తెలిపారు. అదే సమయంలో తమకు సౌకర్యవంతమైన రీతిలోనే ఫి ట్ నెస్ నూ పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతి భారతీయ మహిళకూ చీరతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. పింకథాన్ లాంటి కార్యక్రమాల ద్వారా భారతదేశంలో సమృద్ధి చెందిన మహిళా సమాజాన్ని నిర్మించనున్నామని తెలిపారు. సాధికారత కలిగిన మహిళలతోనే ఆరోగ్యవంత మైన కుటుంబం, ఆరోగ్యవంతమైన దేశం... ఆరోగ్యవంతమైన ప్రపంచము ప్రారంభమవుతుందన్న నమ్మకం ఉందన్నారు. బైట్: మిలింద్ సోమన్, ప్రముఖ మాడల్, నటుడు బైట్స్: శారీ రన్ లో పాల్గొన్న మహిళలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.