ETV Bharat / business

Gold Buying Tips : బంగారు ఆభరణాలు కొనాలా?.. ఈ విషయాలు తెలుసుకోండి!

author img

By

Published : Jul 9, 2023, 12:34 PM IST

Gold Buying Guide : మీరు బంగారంపై పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారా? లేదా ఇంటి కోసం, శుభకార్యాల కోసం బంగారు ఆభరణాలు కొందామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. బంగారం కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Gold buying tips
The ultimate guide to buying gold jewellery

The Ultimate Guide to buying gold jewelry : భారతీయ మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కచ్చితంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ విధంగా కొనుగోలు చేసిన బంగారం మనకు ఆర్థిక అత్యవసర సమయాల్లో కచ్చితంగా రక్షణ కల్పిస్తుంది. అందుకే బంగారానికి ఎనలేని డిమాండ్ మన సమాజంలో ఉంది.

Gold Buying Tips : బంగారం కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత రోజుల్లో అయితే కచ్చితంగా దుకాణానికి వెళ్లి, పరీక్షించి పసిడి ఆభరణాలను కొనుగోలు చేసేవారు. కానీ నేటి టెక్నాలజీ యుగంలో చాలా మంది ఆన్​లైన్​లోనే బంగారు ఆభరణాలు కొనేస్తున్నారు. కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బంగారం ధరలు విషయంలో చాలా అప్​డేట్​గా ఉండాలి. అప్పుడు మాత్రమే సరైన ధరకు సరైన క్వాలిటీ బంగారం కొనగలుగుతారు.​ లేదంటే ఆర్థికంగా బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Gold Buying Guide : వాస్తవానికి బంగారాన్ని గ్రాముల్లో కొలుస్తారు. అందువల్ల ఆభరణాలు కొనే ముందు కచ్చితంగా మీ నగరంలో ఉన్న బంగారం ధరలు గురించి తెలుసుకోవాలి. నిజానికి పుత్తడి ఆభరణాల ధరల్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. దీనికి కారణం.. తయారీ ఖర్చులు, పన్నులు, రవాణా ఛార్జీలు కూడా ఇందులో కలిసి ఉంటాయి. అందుకే నగలు కొనేముందు వీటన్నింటినీ సరిచూసుకోవాలి.

బంగారం కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు
Gold Ornaments Buying Tips :

1. స్వచ్ఛత :
Gold purity check : భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అత్యంత విలువైన, ఆకర్షణీయమైన లోహాల్లో బంగారం ఒకటి. అందుకే బంగారం కొనే ముందు దాని స్వచ్ఛతను కూడా కచ్చితంగా తెలుసుకోవాలి. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్​ బంగారంలో 99.9 శాతం స్వచ్ఛత ఉంటుంది. 22 క్యారెట్​ బంగారంలో 91.67 శాతం స్వచ్ఛత ఉంటుంది. అంటే క్యారెట్స్ ఎంత తక్కువగా ఉంటే.. బంగారంలోని స్వచ్ఛత కూడా అంత తక్కువగా ఉంటుందని అర్థం.

Gold purity percentage : స్వచ్ఛమైన బంగారంతో ఆభరణాలు తయారు చేయలేము. కనుక వీటిలో ఇతర లోహాలను కలిపి ఆభరణాలు చేస్తూ ఉంటారు. సాధారణంగా నగలను, నాణేలను 14 క్యారెట్స్​ లేదా 18 క్యారెట్స్​ బంగారంతో చేస్తారు.

2. హాల్​మార్క్​ :
Gold hallmarking rules : బంగారం కొనేటప్పుడు కచ్చితంగా దానిపై హాల్​మార్క్ ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. ఈ హాల్​ మార్క్​ బంగారం క్వాలిటీ, అస్యూరెన్స్​ గురించి తెలుపే ఒక కొలమానం.

Gold jewelry hallmarks : బంగారు ఆభరణాల తయారీలో కచ్చితంగా అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బంగారంలో కలిపే ఇతర లోహాల శాతాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండి తీరాలి. దీనిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడడానికే.. బ్యూరో ఆఫ్ ఇండియన్​ స్టాండర్డ్స్​ (BIS), బంగారు నగలపై ఈ హాల్​ మార్క్ ఉండడం తప్పనిసరి చేసింది. అందుకే విలువైన నగలపై.. బంగారం స్వచ్ఛత, స్వర్ణకారుడి గుర్తింపు, హాల్ మార్కింగ్​ తేదీలను పేర్కొంటూ లేజర్​ ప్రింటింగ్​ ద్వారా ఒక గుర్తును ముద్రిస్తారు.

3. తయారీ ఖర్చులు :
Gold jewelry making charge : వాస్తవానికి కొనుగోలుదారులు బంగారానికి మాత్రమే కాదు.. నగల తయారీ ఖర్చులు కూడా భరించాల్సి ఉంటుంది. ఆభరణాల డిజైన్​ను అనుసరించి ఈ తయారీ ఖర్చులు మారుతూ ఉంటాయి. అయితే కచ్చితంగా ఈ మేకింగ్ ఛార్జీలు 3 నుంచి 25 శాతం మధ్యలోనే ఉంటాయి.

Gold investment : ఒక వేళ మీరు ఇన్వెస్ట్​మెంట్​ కోసం బంగారం కొనాలనుకుంటే.. నగలకు బదులుగా గోల్డ్ బార్స్​, కాయిన్స్​ కొనుక్కోవడం ఉత్తమం. దాని వల్ల తయారీ ఖర్చుల భారం మీ మీద పడదు.

4. చెల్లించాల్సిన ధర :
Gold ornament price calculator : నగల ధరలను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా బంగారం నాణ్యత, తయారీ ఖర్చులు, పన్నులు అన్నీ కలిసి నగల ధరలో మిలితమై ఉంటాయి. అయితే మీరు సులువుగా బంగారు ఆభరణాల ధరను లెక్కించడానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

ఫైనల్​ జ్యువెలరీ ప్రైస్​ = ఆభరణం కొన్న రోజు ఉన్న గ్రాము బంగారం ధర (24 క్యారెట్​/ 22 క్యారెట్​/ 18 క్యారెట్​) x బంగారం బరువు (గ్రాముల్లో) + తయారీ ఖర్చులు + వృధా ఛార్జీలు (వేస్టేజీ ఛార్జీలు) + జీఎస్టీ

బంగారం కొనడానికి బెస్ట్ ఆప్షన్​
Gold investment options : మీరు బంగారంపై ఇన్వెస్ట్ చేయాలని భావిస్తూ ఉంటే.. కచ్చితంగా డిజిటల్ గోల్డ్​ ఒక మంచి ఆప్షన్​ అవుతుంది. డిజిటల్​ గోల్డ్ కొనుగోలు చేసేందుకు అనేక సంస్థలు 'బీమా గోల్డ్​' పథకాలను అందిస్తున్నాయి. వాటిలో మీకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు.

Digital gold investment options : సాధారణంగా బీమా గోల్డ్ స్కీముల్లో మీరు డిజిటల్​ గోల్డ్​పై పెట్టుబడి పెడతారు. ఇది అత్యవసర సమయాల్లో మీకు ఆర్థికంగా బాగా అక్కరకు వస్తుంది. ఈ స్కీములు ఎలా పనిచేస్తాయంటే.. మీరు ప్రతి నెలా ఈ స్కీమ్ కింద కొంత అమౌంట్​ చొప్పున అడ్వాన్స్ పేమెంట్స్ చూస్తూ ఉండాలి. నిర్దిష్ట వ్యవధి పూర్తి అయిన తరువాత మీరు దానిని రీడీమ్​ చేసుకొని, బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ బీమా స్కీమ్​ల ద్వారా హాల్​ మార్క్ ఉన్న 22 క్యారెట్​ బంగారు ఆభరణాలను లేదా గోల్డ్ కాయిన్స్​ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్కీముల్లో ఉన్న అదనపు బెనిఫిట్స్​​ ఏమిటంటే.. బంగారు ఆభరణాల కొనుగోలుపై ఎలాంటి వాల్యూ అడిషన్స్​, మేకింగ్ ఛార్జీలు విధించరు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.