ETV Bharat / business

ఒకే సెట్​ టాప్​ బాక్స్​తో టీవీ, వీడియో స్ట్రీమింగ్​ సేవలు..

author img

By

Published : Nov 13, 2019, 5:43 AM IST

ప్రస్తుతం వీడియో కంటెంట్​కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వీటిని మొబైల్ ఫోన్లు, ల్యాప్​టాప్​లలో అధికంగా వినియోగిస్తుంటారు. అయితే ఇంట్లోని టీవీల్లో శాటిలైట్​ ఛానెళ్లతో పాటు.. వీడియో స్ట్రీమింగ్​ (ఓటీటీ) సేవలను ఇస్తున్నాయి హైబ్రీడ్ సెట్​ టాప్​ బాక్స్​లు. మరి అవి ఎలా పని చేస్తాయి? వాటితో లాభమేంటి? అనే విషయాలు మీ కోసం.

హైబ్రీడ్ సెట్​టాప్​ బాక్స్​

హైబ్రీడ్ సెట్​ టాప్​ బాక్స్.. దేశ ప్రసార రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న నయా ట్రెండ్​. ఇంతకీ ఏంటి ఈ హైబ్రీడ్ సెట్​ టాప్ బాక్స్​.. దీని ఉపయోగమెంత? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శాటిలైట్​ టీవీతో పాటు.. వీడియో స్ట్రీమింగ్​ (ఓటీటీ) కంటెంట్ వీలుగా వీలుగా ఉండటమే ఈ హైబ్రీడ్​ సెట్​ టాప్​బాక్స్ ప్రత్యేకత.

హైబ్రీడ్ సెట్​ టాప్​ బాక్స్​ ఎందుకు?

వీడియో స్ట్రీమింగ్ యాప్​లు వీడియో కంటెంట్​ను ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత మొబైళ్లు, ల్యాప్​టాప్​ల్లో వీడియో కంటెంట్​ను వీక్షించేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. టీవీల్లో కేవలం శాటిలైట్​ ఛానెళ్లు మాత్రమే ప్రసారం కావడం వల్ల వీక్షకుల సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు డీటీహెచ్ ఆపరేటర్లు, ఛానెళ్ల యాజమాన్యాలు భావిస్తున్నాయి. అమెజాన్ ఫైర్​ స్టిక్​తో టీవీల్లోనూ వీడియో స్ట్రీమింగ్ కంటెంట్​ను వీక్షించే వీలున్నా.. దేశంలో దాని వినియోగం అంతగా లేదు. ఈ కారణంగా టీవీల్లో శాటిలైట్​ ఛానెళ్లతో పాటు.. వీడియో స్ట్రీమింగ్ కంటెంట్​ను వీక్షించే వీలు కల్పించాలని ప్రణాళిక రూపొందించాయి డీటీహెచ్​ సంస్థలు. ఇందులో భాగంగానే హైబ్రీడ్​ సెట్​ టాప్​ బాక్స్​లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.

హైబ్రీడ్​ సెట్​టాప్​ బాక్స్ ఎలా పని చేస్తుంది?

ఈ హైబ్రీడ్​ సెట్​టాప్​ బాక్స్​లకు ఇంటర్నెట్​ అనుసంధానం చేసే వీలుంటుంది. అంతేకాదు వీడియో స్ట్రీమింగ్ సేవలందించే నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్, జీ5, హాట్​స్టార్ వంటి అప్లికేషన్లు ముందుగానే ఇన్​స్టాల్​ చెసి ఉంటాయి. ఏ సేవలు వినియోగించుకోవాలనుకుంటే వాటికి ప్రీమియం చెల్లించి కంటెంట్​ను వీక్షించొచ్చు. ఇదే సెట్​బాక్స్​కు డిష్​ అనుసంధానం చేసే వెసులుబాటు ఉంటుంది. దీని ద్వారా శాటిలైట్ టీవీ ఛానెళ్లను వీక్షించొచ్చు. ఈ రెండింటినీ నియంత్రించేందుకు ఒకే రిమోట్​ను వినియోగించడం దీని ప్రత్యేకత.

మార్కెట్లో ఉన్న హైబ్రీడ్​ సెట్​ టాప్​ బాక్స్​లు ఇవే..

హైబ్రీడ్​ సెట్​టాప్​బాక్స్​ను ముందుగా పరిచయం చేసింది ఎయిర్​టెల్ అనే చెప్పాలి. ఎయిర్​టెల్​ ఇంటర్​నెట్​ టీవీ పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది ఆ సంస్థ. ఆండ్రాయిడ్ టీవీతో పని చేసే ఈ సెట్​ టాప్​ బాక్స్​తో శాటిలైట్ ఛానెళ్లు, వీడియో స్ట్రీమింగ్ కంటెంట్​ను చూసే వీలుంది. ఇటీవలే ఎయిర్​టెల్ ఎక్స్​ట్రీమ్​ పేరుతో మరో హైబ్రీడ్​ సెట్​టాప్​ బాక్స్​ను ఆవిష్కరించింది. డీటీహెచ్​లలో మరో ప్రముఖ సంస్థ డిష్​టీవీ.. డిష్​ స్మార్ట్​హబ్​ పేరుతో హైబ్రీడ్ సెట్​టాప్ బాక్స్​ను తీసుకువచ్చింది. జియో ఆవిష్కరించిన 4కే-సెట్​టాప్​ బాక్స్​ ఇదే కోవలోకి వస్తుంది.

ఇదీ చూడండి: ఇన్ఫోసిస్​పై మరో లేఖాస్త్రం.. సీఈఓనే లక్ష్యం..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Zeist, Netherlands. 12th November 2019.
1. 00:00 Ronald Koeman arrives at the news conference
2. 00:09 SOUNDBITE (Dutch): Ronald Koeman, Netherlands head coach:
"These are two last games and the sooner we qualify the better. Our goal was to qualify (Euro 2020) and ending with draw results that are also possible but we with six points we are on the top of the pool and then is a bigger chance than you survive the group on Euro. However, our goal was the have a place in the Euro."
3. 00:38 SOUNDBITE (Dutch): Ronald Koeman, Netherlands head coach:
"I find that in last two matches we didn't play that good specifically in the ball possession, not precise, also not in the organisation the way we want to play, the speed etc. We had  two opponents that played good in defence and we must be better."
4.  01:08 SOUNDBITE (English): Ronald Koeman, Netherlands head coach:
"I don't think so, what I heard that he ( O'Neill) was coaching only one game for Stoke last weekend and that's a very short time and don't make any seance for the national team."
5. 01:28 SOUNDBITE (English): Ronald Koeman, Netherlands head coach:
(about being open for Barcelona job and that could be a distraction for the team in coming period)
"Now, that's a possibility but after only after Europe cup ."
SOURCE: SNTV
DURATION: 01:40
STORYLINE:
The Netherlands head coach, Ronald Koeman, said on Tuesday "the sooner" his side qualifies to the Euro 2020 "the better" as they prepare for the last two games in their Group C Euro qualifiers.  
Germany and the Netherlands are tied on points and need a maximum of four points from their final two qualifiers.
Both have to play Northern Ireland, which is three points behind in third place.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.