ETV Bharat / bharat

'రైతు ఉద్యమానికి మద్దతివ్వడమే నా తప్పా?'

author img

By

Published : Apr 4, 2021, 4:50 PM IST

కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​. రైతుల నిరసనకు మద్దతు ఇచ్చినందుకు తనను కేంద్ర సర్కారు శిక్షిస్తోందని ఆరోపించారు. తన అధికారాలను లాక్కుంటామని భాజపా సర్కారు బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. హరియాణాలో మహాపంచాయత్​లో పాల్గొన్న కేజ్రీవాల్​.. రైతు నిరసనల్లో మరణించినవారికి నివాళులు అర్పించారు.

They've introduced a bill in Parliament to punish Kejriwal
'రైతు నిరసనలకు మద్దతు ఇచ్చినందుకే నాకు శిక్ష!'

తనను శిక్షించడానికే పార్లమెంటులో కేంద్రం ఓ బిల్లు ప్రవేశపెట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​. ఆ బిల్లు ఆమోదించడం ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి బదులుగా లెఫ్టినెంట్​ గవర్నర్​కు అధికారాలు అప్పజెప్పి.. తనను శిక్షిస్తోందని ఆరోపించారు. రైతుల నిరసనకు మద్దతు ఇచ్చినందుకు ఈ పరిణామాలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం తాము స్వాతంత్ర్య పోరాటం చేశామా? అని హరియాణా జింద్​లో నిర్వహించిన కిసాన్​ మాహాపంచాయత్​లో కేజ్రీవాల్​ ప్రశ్నించారు.

"దేశ రాజధానిలో శాంతి భద్రత సమస్యలున్నాయంటూ నాపై కేంద్రం ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఈ మేరకు నోటీసులు పంపింది. నా అధికారాలను లాక్కుంటామని బెదిరింపులకు పాల్పడుతోంది. అయితే వాటిని పట్టించుకోలేదు. ఆ నోటీసులను తిరస్కరించాను."

- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ సీఎం

దిల్లీకి వస్తున్న రైతులను తొమ్మిది మైదానాల్లో ఉంచి.. వాటిని జైళ్లుగా మార్చడానికి భాజపా సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించారు కేజ్రీవాల్. రైతు నిరసనల్లో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళుల అర్పించారు. అయితే వారి ప్రాణత్యాగం ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'అసోం అభివృద్ధికి కాంగ్రెస్​ వ్యూహమేది?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.